నిదురించు జహాపన..

‘పేమించుకుందాం రా , సూర్యవంశం, మనసంతా’ నువ్వే లాంటి ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలతో ప్రేక్షకులని అలరించిన చైల్డ్‌ ఆర్టిస్ట్‌ ఆనంద్‌ వర్ధన్‌ హీరోగా పరిచయం అవుతున్నారు. ఆయన హీరోగా ప్రసన్న కుమార్‌ దేవరపల్లి దర్శకత్వంలో ఆర్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, శ్రీజ మూవీ మేకర్స్‌ బ్యానర్స్‌పై సామ్‌ జి, వంశీ కష్ణ వర్మ ఓ యూనిక్‌ ఎంటర్‌టైనర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘నిదురించు జహాపన’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ని లాక్‌ చేసిన మేకర్స్‌ మోషన్‌ పోస్టర్‌ని లాంచ్‌ చేశారు. ఆనంద్‌ వర్ధన్‌ మాట్లాడుతూ,’ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చాలా చిత్రాలు చేశాను. ఇప్పుడు కథానాయకుడిగా మీ ముందుకు వస్తున్నాను. ఇదొక గ్రేట్‌ జర్నీ. మీ అందరినీ తప్పకుండా ఈ సినిమా అలరిస్తుంది’ అని తెలిపారు.
‘ఒక మనిషి నిద్రపోయిన తర్వాత కలలు వస్తాయి. ఐతే ఆ కల గురించి ఓ పది నిమషాలు చెప్పుకుంటాం. మిగతా సమయం అంతా ఏం జరుగుతుందనేది ఒక క్వశ్చన్‌ మార్క్‌. అలాగే ఈ సినిమాలో మా హీరో ఆరు నెలలు కంటిన్యూస్‌ నిద్రపోతూనే ఉంటాడు. దాదాపు సముద్ర నేపధ్యంలో సాగే కథ ఇది’ అని దర్శకుడు ప్రసన్న కుమార్‌ చెప్పారు. సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ మాట్లాడుతూ, కథ చాలా నచ్చింది. పాటలన్నీ బాగా వచ్చాయి’ అని చెప్పారు.

Spread the love