నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ బి2బి ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ ఇన్‌ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా, ఈరోజు హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో రెన్యూఎక్స్ 8వ ఎడిషన్‌ను విజయవంతంగా ప్రారంభించింది. పర్యావరణ అనుకూల మరియు హరిత విద్యుత్ పై దృష్టి సారించి దక్షిణ భారతదేశపు పునరుత్పాదక ఇంధన ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు నిర్వహిస్తున్న ఈ ఎక్స్‌పో లో 5000 మంది సందర్శకులు 150+ దేశీయ మరియు అంతర్జాతీయ ఎగ్జిబిటర్లు చేసిన ఆవిష్కరణలను అన్వేషించారు. ఈ ఎక్స్‌పో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా శ్రీ భాగ్యతేజ్ రెడ్డి, డైరెక్టర్ పవర్ & యుటిలిటీస్, పిడబ్ల్యుసి , శ్రీ. ఎన్ జానయ్య, వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్; శ్రీ అజయ్ మిశ్రా, ఐఏఎస్ , ప్రస్తుతం ఛైర్మన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, తెలంగాణ రాష్ట్ర సలహాదారు, ఎనర్జీ కమిటీలు, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, హైదరాబాద్; శ్రీ యోగేష్ ముద్రాస్, మేనేజింగ్ డైరెక్టర్, ఇన్‌ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా మరియు శ్రీ రజనీష్ ఖట్టర్, సీనియర్ గ్రూప్ డైరెక్టర్, ఎనర్జీ పోర్ట్‌ఫోలియో, ఇన్‌ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా తో సహా ప్రముఖులు హాజరయ్యారు. ఇన్ఫార్మా మార్కెట్స్ ఇండియా , మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ యోగేష్ ముద్రాస్ మాట్లాడుతూ, “రెన్యూఎక్స్ అనేది దక్షిణ భారతదేశంలో పునరుత్పాదక ఇంధనం కోసం నిర్వహిస్తున్న ముఖ్యమైన ప్రదర్శన . పర్యావరణ అనుకూల ఇంధన పరిష్కారాల పట్ల భారతదేశం యొక్క నిబద్ధతను మరియు పునరుత్పాదక ఇంధన రంగంలో దాని నాయకత్వాన్ని నొక్కిచెప్పే ఆవిష్కరణలు మరియు వ్యవస్థాపక వెంచర్లు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. రెన్యూఎక్స్ 2024లో భాగంగా సీఈఓ రౌండ్‌టేబుల్‌తో సహా పలు కాన్ఫరెన్స్‌లు సైతం జరుగనున్నాయి” అని అన్నారు.