రైతు కన్నుమూత
వడడెబ్బతో రైతు మృతి
ఇబ్రహీంపట్నంలో ఘటన
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం
వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వడడెబ్బతో రైతు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాయపోల్ గ్రామంలో రాపోలు మంగలి గౌరయ్య (63) రాయపోల్ వరి కొనుగోలు కేంద్రం వద్ద నాలుగు రోజులుగా ఎర్రటి ఎండలో వడ్లు ఆరబోస్తూ అక్కడే ఉంటున్నారు. మాయిశ్చర్ పేరిట రైతులను కొనుగోలు కేంద్రాల ముందు ప్రభుత్వం పడిగాపులు గాయిస్తున్నది. దాన్ని విక్రయించేందుకు రైతులు ధాన్యాన్ని ఆరబెడుతూ, కుప్పనూరుస్తూ ఎరటి ఎండలో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే వర్షం వస్తుందేమోన ని, కుప్పనూరుస్తూ గౌరయ్య ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందాడు. మృతుడికి భార్య వెంకటమ్మ, ఇద్దరు కొడుకులున్నారు. రైతు గౌరయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్ ముసలయ్య డిమాండ్ చేశారు. రైతు మృతితో రాయపోల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పంట కొనుగోళ్లు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు పెట్టడం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కొనుగోలు కేంద్రంలోనే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



