కొత్తూరు మొట్లగూడెం పంట పొలాల్లో ఇసుక మేటలు

– 50 ఎకరాల్లో పంట నష్టం
నవతెలంగాణ-మంగపేట : భారీగా కురుస్తున్న వర్షాలకు కొత్తూరు మొట్లగూడెంలోని గౌరారంవాగు పొంగి పొర్లడంతో వరద వరి పంట పొలాల్లోకి మల్లడంతో ఇసుక మేటలు వేసి 26 మంది రైతులకు చెందిన సుమారు 60 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు రైతులు తెలిపారు. కొత్తూరు మొట్లగూడెంకు చెందిన బంగారు మోహన క్రృష్ట, జిగట బాబు, బంగారు నాగేశ్వర్రావు, జిగట సరోజన, లొల్లి శంకర్, బంగారు సత్యం, బంగారు సంద్య, బంగారు నర్సయ్య, యాలం తాతారావు, లొల్లి నారయణ, పొడెం పాపయ్య, బంగారు వెంకటనర్సయ్య, వట్టం ధశరధం, పొడెం సాంబయ్య, పొడెం శ్రీనివాస్, బంగారు పాపక్క, జిగట శాంత, బంగారు క్రృష్ట, లొల్లి సీతయ్య, బంగారు క్రృష్టరావు బంగారు నర్సింహరావు, బంగారు బాబురావు, బంగారు అప్పారావు, మహేష్, ఈసం రామయ్య, బంగారు నరేష్ లకు చెందిన 60 ఎకరాల వరి పొలాల్లో ఇసుక మేటలు వేసి పంట నష్టం జరిగింది. రెవిన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి బాదిత రైతుల పంట పొలాల్లో సర్వే చేసి నష్ట పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. 

Spread the love