అడవికి సంక్రాంతి వచ్చింది..!!

సంక్రాంతి పచ్చటి అడవిలోకి
అడుగు పెట్టగానే…
సూరీడు దూరాన కొండల్లోంచి
ఆ అడవి గూడేల ఇళ్ళ ముందు
ముగ్గుల్లో ప్రత్యక్ష మయ్యేడు…
అతివల పండగ చీరలు వారి
అందాల్ని అద్దుకొని మెరిశాయి
నాగలికి వ్యవసాయ పనిముట్లకి
పసుపు రాసి కుంకుమలు పెడితే
సాక్షాత్‌ శంకు చక్రాల్లా ఉన్నాయి
రైతులు అరక దున్నుతోంటే …
పిల్లలు తలంటోసుకొని పిండి
వంటలు తిని గాలి పతంగాల్ని
మనసుల్లా ఎగరేసుకుంటున్నారు
అక్కడ మనుషులుండేది తక్కువే
అంతా ప్రకతిదే ఆదిపత్యం…
ఆ అనంత ప్రకతి చెంతకు
అపురూపమైన పండుగ రావడం
అనిర్వచనీయమైన అనుభూతి!!
– భీమవరపు పురుషోత్తమ్‌, 9949800253

Spread the love