త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన పాక్ మహిళ సీమా హైదర్

నవతెలంగాణ – హైదరాబాద్
ప్రేమ కోసం భారత్ వచ్చేసిన పాక్ మహిళ సీమా హైదర్ తాజాగా భారత్‌పై తనకున్న దేశభక్తిని చాటుకునే ప్రయత్నం చేశారు. ఆదివారం నోయిడాలోని తన నివాసంలో భర్త సచిన్, లాయర్ ఏపీ సింగ్‌తో కలిసి ఆమె ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె జాతీయ జెండా ఎగరేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ‘భారత్ మాతాకీ జై’, ‘హిందుస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే, తన జీవితం ఆధారంగా నిర్మిస్తున్న సినిమా ఆఫర్‌ను వదులుకున్నానని కూడా సీమా హైదర్ చెప్పారు.

Spread the love