తోటపల్లిలో అక్రమ ఇసుక నిల్వల సీజ్..

నవతెలంగాణ-బెజ్జంకి

మండల పరిధిలోని తోటపల్లి గ్రామ శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక నిల్వలను పోలీసులు గుర్తించినట్టు తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం తెలిపారు. సుమారు పదిహేను ట్రాక్టర్ల ట్రిప్పుల అక్రమ ఇసుక నిల్వలను సీజ్ చేశామని తహసిల్దార్ తెలిపారు. సీజ్ చేసిన ఇసుక నిల్వలపై తహసిల్దార్ ను వివరణ కోరగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు చేపడుతామని తెలిపారు.
మండలంలో విచ్చలవిడిగా ఇసుక నిల్వలు..
అక్రమ ఇసుక రవాణను నివారిచడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన కఠిన చర్యలు చేపడుతున్న మండల కేంద్రం శివారులోని గుండారం వైపు విచ్చలవిడిగా ఇసుక అక్రమ నిల్వలు దర్శనమిస్తున్నాయి. ఇసుక అక్రమ నిల్వలు, రవాణను అరికట్టడానికి ప్రత్యేకంగా టాస్క్ పోర్స్ అధికారులను ప్రభుత్వం నియమించింది. టాస్క్ పోర్స్ అధికారులు విధుల్లో అప్రమత్తతంగా వ్యవహరిస్తూ మండలంలో అక్రమ కార్యకలాపాలకు శాయశక్తుల కృషి చేస్తున్న మండలంలో ఎక్కడో ఒక చోట ప్రతినిత్యం అక్రమాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మండల అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే అక్రమ కార్యకలాపాలు ఊతం పోసుకుంటున్నాయని జిల్లాధికారులు అధికారుల నిర్లక్ష్య దోరణిపై శాఖపరమైన కఠిన చర్యలు తీసుకుంటే ప్రభుత్వంపై విశ్వాసం రెట్టింపవుతుంది.
Spread the love