ఫైనల్లో సౌత్‌ జోన్‌

సెమీస్‌లో నార్త్‌పై గెలుపు
బెంగళూర్‌ : దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్‌ జోన్‌ ఘన విజయం సాధించింది. నార్త్‌ జోన్‌ నిర్దేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని సౌత్‌ జోన్‌ 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (54, 57 బంతుల్లో 7 ఫోర్లు), కెప్టెన్‌ హనుమ విహారి (43, 42 బంతుల్లో 8 ఫోర్లు) ఛేదనలో కీలక ఇన్నింగ్స్‌లు నమోదు చేశారు. రికీ భురు (34), తిలక్‌ వర్మ (25), సాయి కిశోర్‌ (15 నాటౌట్‌) రాణించారు. 36.1 ఓవర్లలో 8 వికెట్లకు 219 పరుగులు చేసిన సౌత్‌ జోన్‌ దులీప్‌ ట్రోఫీ ఫైనల్లోకి చేరుకుంది. మరో సెమీస్‌లో సెంట్రల్‌ జోన్‌పై వెస్ట్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది.

Spread the love