డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక క్యాంపు

నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఆరోగ్యశాఖ అధికారి లక్ష్మణ్ సింగ్ మంగళవారం సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా అధికారి డి ఎం హెచ్ ఓ మాట్లాడుతూ దొంగిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక క్యాంపు నిర్వహించి రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు రోగ నిర్ధారణ పరీక్షలను బట్టి వైద్యం అందించడం జరుగుతుందని మహిళలకు నిర్వహించే ప్రత్యేక క్యాంపులను మహిళలు ప్రత్యేకంగా హాజరై రోగ నిర్ధారణ జరిపించుకోవాలని జిల్లా వైద్యాధికారి కోరారు మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు

Spread the love