హీరో గోపీచంద్ తన 31వ సినిమాని కన్నడ దర్శకుడు ఎ.హర్షతో చేయబోతున్నారు. యూనిక్ యాక్షన్‌ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం 14గా నిర్మాత కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాతలు ఈ చిత్రానికి ‘భీమా’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ని లాక్ చేశారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో గోపీచంద్ ఫెరోషియస్ పోలీసు అధికారిగా కనిపించారు. ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమాలో గోపీచంద్ వైల్డ్ క్యారెక్టర్‌ని సూచిస్తుంది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌ను మేకర్స్ చిత్రీకరిస్తున్నారు.