విద్యార్థులకు గణాత్మక విద్యను అందించాలి

– జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ- తాడ్వాయి 
ఉపాధ్యాయులు విద్యార్థులకు ఘనాత్మక విద్యను అందించాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఫౌండేషనల్ లీడర్స్ అండ్ న్యూమరసి శిక్షణ శిబిరాన్ని మండల విద్యాశాఖ అధికారి యాప సాంబయ్య ఆధ్వర్యంలో, నోడల్ అధికారి రేగ కేశవరావు పర్యవేక్షణలో నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా అకాడమిక్ మానిటరింగ్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి హాజరై మాట్లాడారు. విద్యార్థులకు ప్రభుత్వం గుణాత్మక విద్య ను అందించాలనే లక్ష్యంతో ఈ శిక్షణను అందిచుచున్నామని విద్యార్థులకు చదవడం రాయడం విషయాలను అవగాహన చేసుకోవడం కోసం ప్రభుత్వం ఉచితంగా వర్క్ బుక్స్ పంపిణీ చేసిందని చెప్పబడే పాఠ్యాంశాల ఆధారంగా విద్యార్థులు ఉపాధ్యాయుల సహకారం తో వర్క్ బుక్స్ సొంతం గా రాసేలా కృత్యాలు స్వతహాగా చేయాలని అన్నారు. శిక్షణను ఉపాద్యాయులు సద్వినియోగం చేసుకొని పూర్తిగా సంసిద్దులై పాఠశాలలకు వెళ్ళాలని కోరారు. శిక్షణలో తెలుసుకున్న విషయాలను కొంతమంది ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.  ఈ శిక్షణలో ఉపాధ్యాయులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love