శేరిలింగంపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆధునీకరణకు తోడ్పాటు

– రూ.45 లక్షలు నిధులు కేటాయించిన రహేజా గ్రూప్‌
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
రహేజా గ్రూప్‌ సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా మంజూరైన రూ. 45 లక్షల చెక్కును మంగళవారం చేవెళ్ల పార్లమెంట్‌ సభ్యులు గడ్డం రంజిత్‌రెడ్డి, కార్పొరేటర్లు రాగం నాగేందర్‌ యాదవ్‌, ఉప్పలపాటి శ్రీకాంత్‌లతో కలిసి రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్‌ రావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సృజన, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అరికేపూడి గాంధీలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లా డుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆధునీకరించి పేద ప్రజలకు అందు బాటులోకి తీసుకురావాలని ఎంపీ రంజిత్‌ రెడ్డి కృషి చేస్తు న్నట్టు చెప్పారు.సీఎస్‌ఆర్‌ఫండ్స్‌ కింద మంజూరైన నిధు లను సద్వినియోగం చేసుకుని ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని హంగులతో, సకల సౌకర్యాలతో తీర్చిదిద్దాని తెలిపారు. అందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సివిల్‌ వర్క్స్‌, శానిటరీ ఆరెంజ్‌మెంట్స్‌, తాగు నీరు, ఎలక్ట్రిసిటీ మొదలగు మౌలిక సదుపాయాల కోసం నిధులు సమకూరుస్తున్నట్టు తెలిపారు. శేరిలింగంపల్లి డివిజన్‌ ప్రజల తరపున ఎంపి రంజిత్‌రెడ్డికి ,సహకరించిన రహేజా గ్రూప్‌నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love