సోషల్ మీడియా ప్రచారం పై  నిఘా పెంచాలి

– మీడియా ట్రాకింగ్ కేంద్రం ప్రారంభం.
– సోషల్ మీడియా ముందస్తు అనుమతులు తప్పని సరి.జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్  ఎస్. వెంకటరావు.
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు, వార్తలపై గట్టి నిఘా పెంచామని  జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. గురువారం  కలెక్టరేట్ నందు సోషల్ మీడియా ట్రాకింగ్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ బి.ఎస్. లత తో కలసి ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్  మాట్లాడుతూ సామాజిక మాద్యమాలైన ఫేస్బుక్, ఇన్ స్ట్రాగామ్, వాట్సప్, యూ ట్యూబ్, ట్విట్టర్ తదితర సామాజిక మాద్యమాల్లో ప్రచారం ఎక్కువగా వస్తున్నందున ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఏర్పాటు చేసిన కేంద్రం ద్వారా సోషల్ మీడియా ఐటమ్స్ పై ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేస్తూ తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. తదుపరి ఏర్పాటు చేసిన  కేంద్రం ద్వారా ముందుగా  అనుమతులు పొందాలని కలెక్టర్ సూచించారు.  ఫిర్యాదుల కేంద్రం నుంచి యంత్రాంగం ఇం టర్నెట్ బేస్డ్ మీడియాలలో వచ్చే ఎన్నికల ప్రచారాలపై పర్యవేక్షణ చేయడం జరుగుతుందని వివరిం చారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై సోషల్ మీడి యాలో వచ్చే వాటిని పరిశీలనలో తీసుకొని చర్యలు తీసు కుంటామని తెలిపారు. తదుపరి సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సి.ఇ.ఓ అప్పారావు,  డి.పి.ఆర్.ఓ  రమేష్ కుమార్, డి.ఈ మల్లేశం, ఏ.ఓ సుదర్శన్ రెడ్డి, ఎన్నికల పర్యవేక్షకులు శ్రీనివాస రాజు,  సోషల్ మీడియా ట్రాకింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love