మృతుని కుటుంబాన్ని పరామర్శించిన స్వర్ణ కార సంఘం

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని పట్నం గ్రామానికి చెందిన కొండపర్తి సదాశివచారి సోమవారం మృతిచెందగా మంగళవారం మండల స్వర్ణకార సంఘం సభ్యులు మృతిని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు కన్నోజు సదానందం మాట్లాడుతూ అనారోగ్య కారణాలతో సదాశివచారి మృతి చెందడం బాధాకరమని అన్నారు. సంగం తరపున మృతిని కుటుంబానికి దహన సంస్కారాల నిమిత్తము 5వేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందిస్తున్నట్లు తెలిపారు. సదాశివ చారి కుటుంబానికి స్వర్ణకార సంఘం ఎల్లవేళలా అండగా ఉండి ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట స్వర్ణకార సంఘం మండల అధ్యక్షులు ముంతజు రాజేంద్ర చారి, తిప్ప ర్తి నరసింహా చారి,కేసోజూ జగన్ , దూరిశెట్టి బ్రహ్మం,రుద్రోజు రాకెశ్ , విశ్వా బ్రాహ్మణ సంఘం.గోవిందరావు పేట మండల అద్యక్షడు కొండపర్తి భాస్కర చారి, వేమునూరి నాగాచారి , తదితరులు పాల్గొన్నారు.

Spread the love