ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో తాండూరు ‘భాష్యం’ జూనియర్‌ కళాశాల విజయ పరంపర

– విద్యార్థుల కృషి ఫలితమే మంచి ఫలితాలు
– కళాశాల కరస్పాండెంట్‌ పర్యాద రామకృష్ణ
నవతెలంగాణ-తాండూరు
విద్యార్థుల కృషి ఫలితంగానే మంచి ఫలితాలను సాధించడం జరిగిందని భాష్యం జూనియర్‌ కళాశాల కరస్పాండెంట్‌ పర్యాద రామకృష్ణ అన్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలలో తాండూరు పట్టణ కేంద్రంలోని ‘భాష్యం’ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో ఆర్‌. కీర్తన 464/470(ఎస్‌ఎస్‌సీ 8.0),ఈ. శ్రావ్య 463/470(ఎస్‌ఎస్‌సీ 9.3),ఆర్‌.వర్ష 462/470(ఎస్‌ఎస్‌సీ 8.5),కె.రక్షిత 461/470(ఎస్‌ఎస్‌సీ 7.8),బి.ఆర్తి 461/470(ఎస్‌ఎస్‌సీ 9.0).అలాగే బైపీసీలో పి.నందిని 425/440(ఎస్‌ఎస్‌సీ 8.5),అస్మా తంకీన్‌ 420/440(ఎస్‌ఎస్‌సీ 8.5), సీఈసీలో చేతన్‌ కుమార్‌ 461/500(ఎస్‌ఎస్‌సీ 7.7),ఆస్థా ఉపాధ్యాయ 458/500(ఎస్‌ఎస్‌సీ 8.2), ఎంఈసీ గ్రూపులో అర్షిత 434/500(ఎస్‌ఎస్‌సీ 8.0),ఈ. నందిని 430/500(ఎస్‌ఎస్‌సీ 8.2) అదే విధంగా ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఎంపీసీలో పటేల్‌ భాగ్యశ్రీ 986/1000, ఎం. ప్రశాంతి 979/1000. బైపీసీలో సాయి స్ఫూర్తి 968/1000,హరీష్‌ 958/1000,మాధురి 957/1000. సీఈసీలో టి. సౌమ్య 967/1000,దీపక్‌ 921/1000 లాంటి అద్భుత ఫలితాలు సాధించి కాలేజ్‌ టాపర్లుగా నిలిచారు. ఈ సందర్భంగా కరెస్పాండంట్‌ పర్యాద రామకృష్ణ మాట్లాడుతూ.. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం, అలాగే అన్నీ గ్రూపులల్లో సుమారు 80శాతం ఉత్తీర్ణత సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ విజయానికి కారణమైన అధ్యాపక బృందానికి, తల్లిదండ్రులకు, విద్యార్థులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్‌ అనురాధ రమేష్‌, ప్రిన్సిపాల్‌ మహిపాల్‌ రెడ్డి, అధ్యాపకులు వెంకట్‌రెడ్డి, మల్లికార్జున్‌,గోవర్ధన్‌,నరేష్‌,సుప్రజా, మధురిమ, పూర్ణిమ పాల్గొన్నారు.

Spread the love