ఇంటింటికీ తాగు నీరందించడమే లక్ష్యం

నవతెలంగాణ- ఉప్పల్‌
ఇంటింటికీ తాగు నీరందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని కార్పొరేటర్‌ బన్నాల గీతా ప్రవీణ్‌ అన్నారు. చిలుకానగర్‌ డివిజన్‌లోని సీతారాం కాలనీలో ఓఆర్‌ఆర్‌ పేస్‌ 2 తాగునీటి పైపులైన్‌ పనులను గురువారం ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ మాట్లాడుతూ ప్రతి ఇంటికీ నీరందించాలనే సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టిం దన్నారు. ఇందులో భాగంగానే చిలుకానగర్‌ డివిజన్‌లోని అన్ని ప్రాంతాలలో ఉన్న పొల్యూషన్‌, లో ప్రెషర్‌ ఉన్న ప్రాంతాలను గుర్తించి కొత్త పైపులైన్లు వేస్తున్నట్లు తెలిపారు.పైప్‌ లైన్లు వేసేటప్పుడు లీకేజీ లేకుండా కనెక్షన్లు ఇవ్వాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు బాన్నల ప్రవీణ్‌ ముదిరాజ్‌, ఏదుల కొండల్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొక్కొండ జగన్‌, మైనార్టీ ప్రెసిడెంట్‌ అబ్బు బారు, గూడూరు రమేష్‌, రామానుజం, నారాయణ రెడ్డి , ముద్ధ్ధం శ్రీనివాస్‌, రవీందర్‌ గౌడ్‌, ఫోటో బాలు, హనీఫ్‌, మహ్మద్‌ గౌస్‌, శ్యామ్‌, బీరప్ప గడ్డ బాలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love