లారీని ఢీకొట్టిన కారు..ముగ్గురు దుర్మరణం

నవతెలంగాణ-హైదరాబాద్ : వేగంగా వెళ్తున్న కారు లారీని ఢీకొట్టగా అందులో ఉన్న ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన కావలి ముసునూరు టోల్ ప్లాజా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్ ప్లాజా దగ్గర లారీని క్రాస్ చేయబోయి ముందు వెళ్తున్న మరో లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జు నుజ్జు కావడంతో అందులో ఉన్న వారు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన బాధితులు పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం కు చెందిన జ్యోతి కళ్యాణి, రాజి, కుమార్‌లుగా గుర్తించారు.

Spread the love