నవతెలంగాణ – రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ శివారు మీర్‌పేట పరిధిలో దారుణం జరిగింది. బీర్ బాటిల్స్ కోసం ఓ వ్యక్తితో గొడవ పెట్టుకుని.. అతన్ని కత్తితో కిరాతకంగా హత్య చేశారు. మృతుడ్ని సాయి వరప్రసాద్‌గా నిర్ధారించారు పోలీసులు. జిల్లెలగూడ నుంచి సాయి వరప్రసాద్.. బీరు బాటిల్స్ కొనుక్కుని వెళ్తున్నాడు. ఈ క్రమంలో కొందరు యువకులు.. అతన్ని అడ్డుకుని బాటిల్స్ తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. అందుకు అతను ససేమీరా అనడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కత్తితో సాయిపై ఆ యువకులు దాడి చేశారు. రక్తపు మడుగులో అక్కడికక్కడే సాయి కుప్పకూలిపోయాడు. బీర్ బాటిల్ హత్య ఉదంతంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన మీర్ పేట్ పోలీసులు.. పల్లె నితీష్ గౌడ్, కిరణ్ గౌడ్,సంతోష్ యాదవ్,పవన్‌లను నిందితులుగా నిర్ధారించారు.