దశాబ్ది ఉత్సవాల పేరుతో దగా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం : రాగిడి

నవతెలంగాణ-ఓయూ
రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ దశాబ్ది ఉత్సవాల పేరుతో దగా చేస్తున్నట్లు కాంగ్రెస్‌ నేత రాగిడి. లక్ష్మారెడ్డి చెప్పారు. గురువారం హబ్సిగూడ చౌరస్తాలో దశాబ్ది దగా నిరసన కార్యక్రమం ఉప్పల్‌ నియోజకవర్గం కాం గ్రెస్‌ పార్టీ నేత రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహి ంచిన నిరసనలో అన్నట్టు. టిపిసిసి అధ్యక్షులు రేవం త్‌రెడ్డి పిలుపు మేరకు కేసీఆర్‌ దశాబ్ది దగా నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా హబ్సిగూడ చౌరస్తా వద్ద వందలాది కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో నిరసన కార్యక్రమం నిర్వహించి ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం లక్ష్మారెడ్డిని అరెస్టు చేసి ఉస్మానియా పోలీసులు పోలీస్‌ స్టేషన్‌ తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో దగా చేస్తూ ప్రభుత్వ ధనాన్ని తమ సొంత పార్టీ ప్రచారానికి నిధులు దుర్వినియోగం చేస్తున్నాయని, ఇప్పటివరకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ప్రతిసారి ఎలక్షన్ల ఉన్న తరుణంలో మళ్లీ ఏవో కొత్త పథకాలు పెడుతూ ప్రజలని మభ్యపెట్టి మాయ చేసి పథకాలు అందకుండా చేయ డం వారి నైజం అన్నారు. అనంతరం కాప్రా తహసీ ల్దార్‌కి మెమోరాండంను అందజేశారు. కార్యక్ర మంలో టిపిసిసి సెక్రెటరీ, ఉప్పల్‌ నియోజకవర్గం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ శాంబుల శ్రీకాంత్‌ గౌడ్‌, టిపిసిసి మైనారి టీస్‌ జనరల్‌ సెక్రెటరీ సంజరు జైన్‌, మేడ్చల్‌ మల్కా జిగిరి జిల్లా ఎస్సీ సెల్‌ చైర్మన్‌ పత్తి కుమార్‌, నాచారం డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జ్‌ మేడల మల్లికార్జున్‌ గౌడ్‌, హబ్సిగూడ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు కాలేరు జే నవీన్‌, రామంతపూర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్‌ రఫీక్‌, మల్లాపూర్‌ డివిజన్‌ కంటెస్టెడ్‌ కార్పొరేటర్‌ వంగేటి సంజీవరెడ్డి, పాల్గొన్నారు.

Spread the love