కార్మికులపై అత్యంత దారుణమైన దాడి – సీడబ్ల్యూయూ నేత డేవ్‌ వార్డ్‌

లండన్‌ : మెరుగైన వేతనాలు, పని పరిస్థితుల కోసం నెలల తరబడి రాయల్‌ మెయిల్‌ కార్మికులు పోరాడుతున్నారు.
రాయల్‌ మెయిల్‌ కార్మికుల కొరకు కుదిరిన కొత్త ఒప్పందం వివరాలను తెలియచేసేందుకు కమ్యూనికేషన్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి డేవ్‌ వార్డ్‌ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు.
అందులో భాగంగా ఆయన మంగళవారం గ్లాస్గోలో బుధవారం బెల్‌ఫాస్ట్‌లో పర్యటించారు. ఈ పర్యటనలు ఆశించిన ఫలితాన్ని ఇస్తున్నాయన్నారు.
ఈ సందర్భంగా ఆయన రాయల్‌ మెయిల్‌ భవితవ్యం, కార్మికుల కొత్త ఒప్పందం, లేబర్‌ పార్టీతో యూనియన్‌ సంబం ధాలు తదితర అంశాలపై మాట్లాడుతున్నారు. ‘చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సైమన్‌ థాంప్సన్‌ వెళ్ళిపోయారని, ఇంకా కొంతమంది వైదొలగాల్సిన అవసరం వుందని వార్డ్‌ అన్నారు.
మార్పు రావాల్సిన ఆవశ్యకత వుందని స్పష్టం చేశా రు. అయితే ఆ సంస్కృతిని విచ్ఛిన్నం చేయడం కష్టమే అయినా మార్పు తప్పదన్నారు.

Spread the love