ఒలింపిక్ విజేత సాక్షి మాలిక్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని మైనర్ రెజ్లర్ కుటుంబంపై బ్రిజ్ భూషణ్ సింగ్ అనుయాయులు తీవ్ర ఒత్తిడి చేశారని రెజ్లర్, ఒలింపిక్ విజేత సాక్షి మాలిక్ పేర్కొన్నారు. డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత రెజ్లర్ సాక్షి మాలిక్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మైనర్ అథ్లెట్ కుటుంబంపై తీవ్ర ఒత్తిడి ఉందని అన్నారు. ”పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పేరు ఉంది. మైనర్ కేసులో కుటుంబంపై చాలా ఒత్తిడి ఉందని స్పష్ట మైంది. మిగిలిన అంశాలపై తదుపరి చర్యపై నిర్ణయం తీసు కుంటాము. డిమా ండ్లను ప్రభుత్వం నెరవేరుస్తుంది’ అని సాక్షి అన్నారు. ఛార్జిషీట్ పొంద డానికి రెజ్లర్ల తరపు న్యాయవాది దరఖాస్తు చేసుకున్నారని, దాని ప్రకారం తదు పరి దశను నిర్ణయిస్తామని చెప్పారు. ”ఛార్జిషీట్‌లో బ్రిజ్ భూషణ్ దోషి అని స్పష్టంగా పేర్కొన్నారు.