పనులు చేస్తున్న డబ్బులు రావడం లేదు..

– మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి ఫిర్యాదు చేసిన ఉపాధి కూలీలు
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఉపాధి హామీ కూలీలకు గత తొమ్మిది వారాలుగా చేసిన డబ్బులు రావడంలేదని వివిధ రకాల ఇబ్బందులను మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ రూరల్ నీయోజకవర్గ ఇంచార్జీ డాక్టర్ భూపతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామంలో ఉపాధి హామీ కూలీల స్థితిగతులు తెలుసుకోవడానికి ఉపాధి హామీ కూలీలను కలుసుకున్నారు.ఈ సందర్బంగా ఉపాధి హామీ కూలీలకు గత తొమ్మిది వారాలుగా తాము ఎండను సైతం లేక్ చేయకుండా పనులు చేసిన డబ్బులు రావడంలేదని, వివిధ రకాల ఇబ్బందులను మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన డాక్టర్ భూపతి రెడ్డి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఉపాధి హామీ కూలీలు పడుతున్న ఇబ్బందులను తేచ్చారు. అధికారులు సానుకూలంగా స్పందించి వారం గడువులోగ ఉపాధి హామీ కూలీల డబ్బులు సక్రమంగా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చారు.అనంతరం ఇందల్ వాయి మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు మెత్కురి నవీన్ గౌడ్ అమ్మ అనారోగ్యంతో ఉన్నందున ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం చేయించే విధంగా చూడాలని ఎల్లప్పుడూ అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతి రెడ్డి భరోసా ఇచ్చారు. ఆయన వెంట టీపిసిసి డెలిగేట్ మోత్కూరి శేఖర్ గౌడ్ ,డిసిసి సెక్రెటరీ వెల్మ భాస్కర్ రెడ్డి,అంబర్ సింగ్, ఉప సర్పంచ్ నవీన్ గౌడ్, కుమ్మరి గంగాధర్, ఒడ్డె రాజన్న తోట ప్రకాష్, రాజన్న ,వసంతరావు, కర్స మోహన్, లారీ గంగన్న, రాయసింగ్, తోట రాజన్న, సాయందర్, నారాయణ ,వెంగల్, బాబురావు, శ్రీనివాస్, గబ్బర్ సింగ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love