ఒకే రన్‌వే పైకి రెండు విమానాలు !

టోక్యో : టోక్యోలోని ప్రధాన విమానాశ్రయంలో ఒకే రన్‌వేపైకి రెండు ప్రయాణికుల విమానాలు వచ్చేశాయి. ప్రమాదవశాత్తూ ఆ రెండు ఒకదానినొకటి తాకాయని అయితే ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఒక విమానానికి రెక్క ఒకటి కొద్దిగా దెబ్బతిందని తెలుస్తోంది. బ్యాంకాక్‌ వెళుతున్న థాయి ఎయిర్‌వేస్‌ అంతర్జాతీయ విమానం, తైపే వెళుతున్న ఎవా ఎయిర్‌వేస్‌ విమానం ఈ రెండూ హనెడా విమానాశ్రయంలో ఒకదానినొకటి తాకాయి. దాంతో రన్‌వేను మూసివేసినట్లు జపాన్‌ మీడి యా తెలిపింది. ఒకే రన్‌వేపై రెండు ప్రయాణికుల విమానాలు వున్న దృశ్యా లను మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. కాగా దీనిపై వ్యాఖ్యానిం చడానికి ఎయిర్‌లైన్స్‌, విమానాశ్రయం, రవాణా మంత్రిత్వ శాఖ అధికారులు ఎవరూ అందుబాటులో లేరు. ప్రమాద కారణం కూడా తెలియరాలేదు.

Spread the love