జీడబ్ల్యుఎంసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాం

– ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ భాస్కర్‌
నవతెలంగాణ-వరంగల్‌
హనుమకొండ నగరానికి విచ్చేసిన మున్సిపల్‌ చీఫ్‌సెక్రటరీ అరవింద్‌ కుమార్‌, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినరు భాస్కర్‌లకు గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగ కార్మికుల సమస్యలపై వినతి పత్రం అందించడం జరిగింది కార్మిక సంక్షేమ మహోత్సవ సందర్భంగా దాస్యం వినరుభాస్కర్‌ఆధ్వర్యంలో సమ స్యల పరిష్కారం కోసం ఔట్‌సోర్స్‌ కార్మికుల వేతనం రూ.26వేలు, ఉద్యోగుల రెగ్యులైజేషన,్‌ స్వచ్ఛఆటో ఓనర్‌కమ్‌ డ్రైవర్‌ 163 మంది వీరే కాక అర్బన్‌ మలేరియా 90 మంది ఔట్‌సోర్స్‌ ఉద్యోగులుగా గుర్తించి ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని విన్నవించడం జరిగింది. ఈ సందర్భంగా దాస్యం వినరు భాస్కర్‌ మాట్లాడుతూ త్వరలోనే సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించేలా కృషి చేస్తానని తెలిపారు. ఈకార్యక్రమంలో బీఆర్‌టీయు హన్మ కొండ జిల్లా అధ్యక్షులు నాయినిరవి, మున్సిపల్‌ అధ్యక్షులు నద్దునూరి రాజేష్‌ఖ న్నా, డ్రైవర్‌ యూనియన్‌ అధ్యక్షులు పడాల రామ్మూర్తి, అర్బన్‌ మలేరియా 90 మంది అధ్యక్షుడు అల్వాల ఉమేందర్‌, మట్టెడ అనిల్‌, మేకల సమ్మయ్య, ఎలక్ట్రిషన్‌ రవితేజ, సురేందర్‌, పున్నం చందర్‌, మహేందర్‌, సాంబరాజు, శ్రీనివాస్‌, రామచందర్‌, మైదాన్‌, నరేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love