తవ్వేసిన సర్వీస్‌ రోడ్డు వినియోగంలోకి తెచ్చే దెప్పుడు

నవతెలంగాణ-కూకట్‌పల్లి
ముంబాయి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న వివేకానంద నగర్‌ కాలని ఉషా ముళ్ల పూడి కమాన్‌ సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ నుంచి, వివేకానంద నగర్‌ కమాన్‌ వరకు ఉన్న సర్వీస్‌ రొడ్డును ప్రోక్లెయిన్‌తో పెకిలించి, తొలగించిన వ్యర్థాలను అక్కడే ఉంచి, రోడ్డు నిర్మాణం వైపు చర్యలు తీసుకోకపోవడంతో అధికారు లపై వాహన దారులు, స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. షాపింగ్‌ మాల్‌ యజమాన్యాలు ఆక్రమించు కుని తమ అవసరాలకు వినియోగించు కోవడం వల్ల, ప్రజలకు ఉపయోగపడాల్సిన సర్వీస్‌ రోడ్డు ప్రజా వినియోగంలో లేదని, పలు పత్రికల్లో వార్తలు రావడం, పలువురు నాయకుల ఫిర్యాదుల మేరకు.. కూకట్‌పల్లి జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు, సర్వీస్‌ రోడ్డును పూర్తిగా పెకిలించి, వ్యర్థాలను సైతం అక్కడే వదిలేసి, రోడ్డు నిర్మాణం చేయడం మర్చిపోయిన అధికారులు. సర్వీస్‌ రోడ్డు నిర్మాణం పూర్తి చేయక పోవడం వల్ల, పెకిలించిన రోడ్డు వ్యర్థాలు, మట్టి కుప్ప లు, రోడ్డుపై ఉండిపోవడంతో, అటుగా ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొవడంతో పాటు, షాపింగ్‌ మాల్‌ల ముందు యధావిధిగా కొనసాగుతున్న అక్రమ పార్కింగ్‌లతో మళ్ళీ మొదటికొచ్చిన సమస్య… కావున తవ్వేసిన రోడ్డును వెంటనే నిర్మించి, సర్వీస్‌ రోడ్డుతో పాటు ఫుట్‌ పాత్‌ను ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Spread the love