పట్టా భూమిలో కబ్జాకు పాల్పడడంతో భూ వివాదం

– కుటుంబీకులు లేని సమయంలో కిరాయి మనుషులను రప్పించి దౌర్జన్యం చేస్తున్నారంటూ కబ్జాదారులను అడ్డుకున్న మహిళలు.
– ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం
– కబ్జాదారులు, పోలీస్‌లు కుమ్మక్కై కావాలనే వేధిస్తున్నారంటూ బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన..
– పోలీసుల జ్యోక్యంతో సద్దుమణిగిన వైనం
నవతెలంగాణ-దుండిగల్‌
ఉమ్మడి కుత్బుల్లాపూర్‌ మండలం పరిధిలో కానరాని భూ వివాదాలు ఔటర్‌ రింగ్‌ రోడ్డు పుణ్యమా భూముల రేట్లు కోట్ల రూపాయలు పలకడంతో గతంలోని గ్రామ పంచాయితీలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌గా మారడం తో సుమారు 8 సంవత్సరాల కాలంగా ముఖ్యంగా దుండి గల్‌ పోలీస్‌ స్టేషన్‌లో భూ వివాదాల పంచాయతీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిత్యకత్యంగా మారింది అనడంలో సందేహం లేదు. తాజాగా మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌ నియోజక వర్గం దుండిగల్‌ మున్సిపాలిటీ గాగిల్లపూర్‌లో మరో సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గాగిల్లపూర్‌ గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌.235 లోని 4 ఎకరాల స్థలాన్ని గాగిల్లపూర్‌ గ్రామానికి చెందిన మోర భూమి సాయిలు 1989 లో అదే గ్రామానికి చెందిన మహమ్మద్‌ కరీముద్ది నుంచి కొనుగోలు చేసాడు. నంబర్‌ ఏ/2029/89 ప్రకారం 725 రూపాయల స్టాంపు డ్యూటీతో అప్పటి కుత్బుల్లాపూర్‌ తహసీల్దార్‌ రిజిస్ట్రేషన్‌ చేశారు. అప్పటి నుంచి ఆయన తదనంతరం కుమారులు మోర మల్లేష్‌, మోర అశోక్‌, మోర యాదయ్య, మోర గోపాల్‌లు పేరిట డాక్యుమెంట్స్‌ ఉన్నాయి. అదే సర్వే నంబర్‌లో ఉన్న మిగతా 2 ఎకరాల 15 గుంటల స్థలాన్ని నగరానికి చెందిన అల్వాల్‌ రెడ్డి 2023లో కొనుగోలు చేసాడని ఈ స్థలం వివాదంపై సర్వేయర్‌ సైతం సర్వే చేయడం2024 లో జరిగింది. గాగిల్లపూర్‌లో ఎకరా పొలం 20 కోట్లకు పైగా పలుకుటుండడం, కొన్న స్థలంలో రోడ్డు వెడల్పు రూపంలో కొంత వెళ్లడంతోనే ఇరువురి మధ్య వివాదం చోటు చేసుకుంది.ఈసర్వే అనంతర స్థలం తగ్గడంతోనే అల్వాల్‌ రెడ్డి మా పొలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూన్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇటీవల మోర భూమి సాయిలు కుమారులు బొందల గడ్డ ను వేరే వ్యక్తులు కబ్జా నివారించడం విషయంలో తగాదాతో జైలుకు వెళ్లడంతో ఇదే అదనుగా బావించన సదరు వ్యక్తులు స్థానిక పోలీస్‌ల సహకారంతో 30 మంది గుండాలతో గ్రామంలో హల్చల్‌ చేస్తూ షెడ్లను తొలగించి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తు న్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. జైలు నుంచి వచ్చాక సమస్యను పరిష్కరించుకుందామని మహిళలు అడ్డుకున్న వినకపోవడంతో గ్రామంలో ఘర్షణ వాతా వరణం చోటుచేసుకుంది. చివరకు పెట్రోలింగ్‌ పోలీస్‌లు వచ్చి సర్దిచెప్పడంతో కొంతమేరకు గొడవ సద్దుమనిగింది.
బాధిత కుటుంబ సభ్యుల మహిళల ఆరోపణ
ఇంటి మగవాళ్లు ఒక్కరోజు ముందే తగాదాతో జైలుకు వెళ్లడం పోలీసులకు సైతం తెలిసిందేనని, ఈ సమయంలో అల్వాల్‌ రెడ్డి అనుచరులతో మరి కొంతమంది కూలీలను సైతం తెచ్చుకొని కబ్జాకు ప్రయత్నించడం పోలీసులు సైతం ఈ వివాదంతో ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి రావడం న్యాయం చేయవలసిన పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు కనబడుతుందని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు.

Spread the love