రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది

– సీపీఐ రాష్ట్రసమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం
– బారి గేట్లు తొలగించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు సీపీఐ సిద్ధం
– అటవీశాఖ తీరుపై మున్సిపల్‌ కమిషనరుకు ఫిర్యాదు
నవతెలంగాణ-పాల్వంచ
పాల్వంచ నడిబొడ్డున పలు కాలనీలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులను కలిపే ప్రధాన రహదారిని మూసివేసే అర్హత అటవీశాఖకు ఎక్కడదని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక ఫారెస్ట్‌ రోడ్డులో అటవీశాఖ అక్రమంగా బారి గేట్లుతో రహదారి మూసివేసిన విషయం తెలుసుకున్న సీపీఐ నాయకులు రహదారిని పరిశీలించి స్థానికులతో కలిసి మున్సిపల్‌ కమిషనర్‌ను కలసి సమస్యను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాల్వంచ పంచాయితీ కాలం నాటి నుండి ప్రజలు నిత్యం తమ పనుల మీద ఈ రహదారిగుంటనే రాకపోకలు సాగిస్తూ ఉంటారని, అటవీశాఖ అధికారులు తమ ఇష్టానుసారంగా రహదారిని మూసివేయడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. తమ పరిదిదాటి అటవీశాఖ అధికారులు ప్రవర్తించడం తగదని, తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్న అటివిశాఖ అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్‌ స్థానిక శాసనసభ్యులకు ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు. మున్సిపల్‌ శాఖ అధికారులు ప్రజల ఇబ్బందుల దష్ట్యా రహదారిని తక్షణమే పునరుద్ధరించాలిని, లేనిపక్షంలో పోరాటం తప్పదని హెచ్చరించారు. అటవీశాఖ అధికారుల తీరులో మార్పు రాకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. అనంతరం స్థానిక ప్రజలతో కలిసి మున్సిపల్‌ కమిషనర్‌ స్వామికి వినతి పత్రం అందించారు. 24 గంటల్లో అటవీ శాఖ అధికారులు పెట్టిన బారి గేట్లు తొలగించకుంటే ప్రత్యక్ష ఆందోళనకు సీపీఐ సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి వీశంశెట్టి పూర్ణచంద్రరావు, పట్టణ కార్యదర్శి అడుసుమల్లి సాయిబాబు, జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, ఉప్పుశెట్టి రాహుల్‌, దుర్గిరాల సుధాకర్‌, వీ.పద్మజ, శనగారపు శ్రీనివాసరావు, నరహరి నాగేశ్వరరావు, అన్నారపు వెంకటేశ్వర్లు, గాలి పద్మ, లక్ష్మీ, పాషా, జకరయ్య, వైఎస్‌ గిరి, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, రామకష్ణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love