
నవతెలంగాణ – వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం- శ్వేతసౌధంలో తెల్లపొడి కలకలం సృష్టించింది. దానివల్ల భవనాన్ని కొంతసేపు ఖాళీ చేయించాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే.. శ్వేతసౌధంలో ఆదివారం సాయంత్రం యునెటైడ్ సీక్రెట్ సర్వీస్ సిబ్బంది తెలుపు రంగులో ఉన్న పొడిని గుర్తించారు. వెంటనే అప్రమత్తమై, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా భవనంలోని వ్యక్తుల్ని కొద్దిసేపు సురక్షిత ప్రదేశంలోకి తరలించారు. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అక్కడ లేరు. పొడిని ప్రయోగశాలకు పంపగా ప్రాథమిక పరీక్షలో ‘కొకైన్ పాజిటివ్’ అని వచ్చింది. అది అక్కడికి ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.