– టోల్ ప్లాజా వద్ద గ్రామస్తుల ఆందోళన, ముట్టడి, ధర్నా..
– తమకు ఫ్రీపాసులు ఇవ్వాల్సిందే..
నవతెలంగాణ – డిచ్ పల్లి
జాతీయ రహదారి వివరిస్తున్న సమయంలో చాలా విలువైన భూములను అందజేసిన వారి నుండే రాకపోకలు సాగించే సమయంలో టోల్ ప్లాజా వద్ద డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసం అని వెంటనే సమీప గ్రామాలకు చెందిన వాహనదారులకు ఫ్రీ పాసులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం గ్రామస్తులు ముకుమ్మడిగా టోల్ ప్లాజా న ముట్టడి చేసి గేటు వద్ద ఆందోళన చేపట్టి ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపిటిసి మారంపల్లి సుధాకర్, మాజీ సర్పంచ్ పాశం కుమార్, సహకర సోసైటి చైర్మన్ చింతల పల్లి గోవర్ధన్ రెడ్డి, సహకార సొసైటీ మాజీ చైర్మన్ పాశం నర్సింలు,ఇందల్ వాయి గ్రామ అభివృద్ది కమిటీ చైర్మన్ కుమ్మరి మోహన్ లు మాట్లాడుతూ.. టోల్ ప్లాజా నిర్మించినప్పుడు సమీప గ్రామస్తులకు ఫ్రీ పాసులు ఇస్తారని అనుకున్నామని కానీ నాటు నుండి నేటి వరకు పాసులు ఇవ్వకుండా డబ్బులు చెల్లించే విధంగా ఆదేశాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అన్నారు. వ్యవసాయ సీజన్లో ఇందల్వాయి గన్నారం చంద్రయాన్ పల్లి గ్రామాలకు చెందిన రైతులు ఎరువుల కోసం ఇతరత్రా సామాగ్రి కోసం రాకపోకలు సాగించే సమయంలో పాసులు లేక నిర్దాక్షిణ్యంగా టోల్ ప్లాజా సిబ్బంది సమీప గ్రామాలకు చెందిన వాహనదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఇకనుండి తమ రూపాయి కూడా చెల్లించమని తమకు ఫ్రీ బస్సు పాసులు ఇవ్వవలసిందేనని వారు డిమాండ్ చేశారు. రహదారి వెంట కోట్ల రూపాయల విలువ కలిగిన భూములను కారు చౌక ధరలకే కట్టబెడితే తమకు నజరానగా ఇలా డబ్బులు వసూలు చేయడం తగదన్నారు నేషనల్ హైవే అథారిటీ అధికారులకు విషయాన్ని తెల్పి సమీప గ్రామాలకు చెందిన నియమ నిబంధనల ప్రకారం తమకు ఫ్రీ కార్ పాసులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని టోల్ ప్లాజా మేనేజర్ వీరబాబు కు వినతి పత్రాన్ని అందజేసే అందజేశారు ఈ సమస్య పరిష్కరించకుంటే అన్ని గ్రామాల ప్రజలు ఏకమై టోల్ ప్లాజాలను ఇబ్బందిస్తామని హెచ్చరించారు. అంతకుముందు టోల్ ప్లాజా అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఉన్నతాధికారులు రావాలని పట్టుపట్టారు.ఈ కార్యక్రమంలో మోచ్చ గోపాల్, ముత్తన్న, జెగ్గ గంగాదాస్, మురళి, శ్రీనివాస్,యామాద్రి గంగాధర్, మెందే రవి, నాగబోయి గంగాధర్, సిర్నాపల్లి గంగారం, నిజాం, మంగలి శ్రీనివాస్,గంగారం, సంఘం భూమయ్య, రావోజి బాలగంగారం తోపాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.