– నాన్ లోకల్ ప్రజలకు ప్రతినిధిగా పని చేస్తా..
– మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ – మీర్ పేట్
నాన్ లోకల్ ప్రజలకు ప్రతినిధి ప్రతినిధిగా నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ 9,10వ డివిజన్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా 10వ డివిజన్ కార్పొరేటర్ ముద్ద పవన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగంగా సభలో మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో నందీహిల్స్ కాలనీలోని డ్రైనేజి అవుట్ లేట్ సమస్యను పరిష్కారం చేయాలని ప్రజల కోరిక మేరకు సంబంధించిన తీగల మోహన్ రెడ్డి సోదరులతో మాట్లాడి ఔట్లెట్ నిర్మాణం చేసుకున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం ప్రజాప్రతినిధులకు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పని చేయాలని చెప్తుంటారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు సబితా ఇంద్రారెడ్డి నాన్ లోకల్ అని విమర్శలు చేస్తున్నారు. నియోజకవర్గం అభివృద్ధి చేస్తూ నాన్ లోకల్ ప్రజలకు ప్రతినిధిగా పనిచేస్తానని చెప్పారు. మీర్ పేట్ కార్పోరేషన్ లో అనుకూలమైన పాలకవర్గం ఉండటం కూడా సమస్యలను పరిష్కారం చేయడం సాధ్యమవుతుందని తెలిపారు. చెరువుల మురికి కుపలుగా ఉన్న చెరువులను అభివృద్ధి చేస్తూ సుందరికరణ చేసుకున్నామని పేర్కొన్నారు. ఎన్ని నిధులు అవసరం ఉన్న తీసుకోండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి అని ముఖ్యమంత్రి కేసీఆర్ దైర్యం ఇవ్వడం వల్లనే అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. మంచి నీటి సమస్య, రోడ్లు, డ్రైనేజి సమస్యలు త్వరలోనే పరిష్కారం అందుతుంది తెలియజేశారు. ముఖ్యమంత్రి మంత్రి కేసీఆర్ మంచి విజన్ ఉన్న నాయకుడు ఆయనతో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాట్లు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని కొనియాడారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓట్ల కోసం కాదు రాజకీయం నన్ను నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం.. నియోజకవర్గం అభివృద్ధి కోసం.. ఒక తరం అభివృద్ధి కోసం రాజకీయం చేస్తాను..నిరంతరం ప్రజల సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో నిరంతరం ప్రజల బాగుకోసం తపన పడుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి, బిఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ప్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ సిద్దాల లావణ్య బీరప్ప, స్థానిక కార్పొరేటర్లు, కో అప్షన్ సభ్యులు, వివిధ కాలనీల అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.