‘యమహో’ ‘యమహా’…

సాధన, శ్రమ, పరిశీలన ద్వారా తనలో అంతర్గతంగా ఉన్న సృజనాత్మకతకు సానపడితే అది ప్రకాశిస్తుంది. వెలుగులోకి వస్తుందని రుజువు చేసాడు – అమెరికాకు చెందిన ‘రాబర్ట్‌ జెఫర్సన్‌ ట్రావిస్‌ పాండ్‌’. కేవలం ‘యమహా మోటారు బైక్‌’ కి సంబంధించిన పాత విడిభాగాలైన నట్లు, బోల్టులు, స్ప్రింగులు, ఫుట్రెస్ట్స్‌, హ్యాండిల్‌ బార్‌, హెడ్‌ లైట్స్‌, బ్రేక్స్‌, చైన్‌… ఇలా తుక్కు (స్క్రాప్‌) తో జంతువులనీ, పక్షులనీ, జలచరాలను నయనానందకరంగా, వైవిధ్యభరితంగా సష్టించాడు. అద్వితీయమైన గ్యాలరీలు ఏర్పాటు చేసి వీక్షకులకి ఆనందం కలిగిస్తూ చెత్తతో కొత్త వస్తువులను క్రియేట్‌ చేయవచ్చని గేర్‌ మార్చి మరీ తెలియచేస్తున్నాడు. ‘స్క్రాప్‌’ తో కళాకృతులను సృజిస్తూ ‘క్లాప్స్‌’ని సొంతం చేసుకుంటున్నాడు ‘పాండ్‌’. ఎవరైనా ప్రేరణ పొంది మరిన్ని సరికొత్త కళాఖండాల్ని ఆవిష్కరిస్తే అంతకన్నా కావల్సిందేముంది?
– ఆనంద ‘మైత్రేయ’మ్‌, హైదరాబాద్‌

Spread the love