భూగోళాన్ని నరకంవైపు లాగుతున్న జెలెన్‌ స్కీ

– అమెరికాలో రష్యా రాయబారి ఆరోపణ
న్యూయార్క్‌ : యుద్ధరంగంలో విఫలమైన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు, జెలెన్‌ స్కీ ఐరోపాలో అత్యంత పెద్దదైన జపోరోజ్యే అణువిద్యుత్‌ ప్లాంటుపైన దొంగదాడిచేసి, ఆ దాడిని రష్యాపైన నెట్టి నాటోను ప్రత్యక్షంగా యుద్ధంలోకి లాగాలని ప్రయత్నిస్తున్నాడని అమెరికాలో రష్యా రాయ బారి అనటోలి అంటనోవ్‌ ఆరోపించారు. కండ్లకు కని పిస్తున్న విషయాన్ని ఏమీ కనపడనట్టు మీడియా నటిస్తోంది. యుద్ధం మొదలయి నప్పటి నుంచీ రష్యా చేసినట్టు చెప్పబడుతున్న విద్రోహ చర్యలన్నీ ఉక్రెయిన్‌ చేసినవేనని అంటనోవ్‌ న్యూస్‌ వీక్‌కు ఇచ్చిన ఈమెయిల్‌ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఇప్పుడు వచ్చిన తేడా ఏమంటే ఐరోపా అణు భద్రత ప్రమాదంలో పడటంవల్ల అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉండటం. జపోరోజ్యే అణువిద్యుత్‌ ప్లాంటులో రష్యా పేలుడు పదార్థాలు పెడుతోందని జెలెన్‌ స్కీ ఆరోపించాడు. 2022మార్చి నెల నుంచి తమ స్వాధీనంలోవున్న అణువిద్యుత్‌ కేంద్రాన్ని రష్యా నాశనం చేయబోతోందని చెప్పటం మూర్ఖత్వం అవుతుందని అంటనోవ్‌ అన్నారు. ఉక్రెయిన్‌ ప్రతిదాడి ఘోరంగా విఫలం కావటంతో అమెరికా నాయకత్వంలోని నాటో సైన్యాన్ని ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనేలా చేయటమే లక్ష్యంగా ఉక్రెయిన్‌ రష్యాపైన ఇటువంటి ఆరోపణలు చేస్తోంది. దీనితో ఒక ప్రాంతీయ సంఘర్షణ మూడవ ప్రపంచ యుద్ధంగా పరిణమించటమే అవుతుందన్న స్రుహ పశ్చిమ దేశాల పాలక వర్గాలకు ఉండాలని ఆయన న్యూస్‌ వీక్‌కు చెప్పారు. ఒకవైపు ఉక్రెయిన్‌ రష్యాపైన ఇలా ఆరోపిస్తుం డగా మరోవైపు జపోరోజ్యే అణువిద్యుత్‌ ప్లాంటును పర్యవేక్షిస్తున్న అంతర్జాతీయ ఆటమిక్‌ ఎనర్జీ ఏజెన్సీ సదరు విద్యుత్‌ ప్లాంటులో ఎటువంటి పేలుడు పదార్దాలు గానీ, మందు పాతరలుగానీ లేవని ప్రకటించింది. 2022 సెప్టెంబర్‌ నుంచి అంతర్జాతీయ ఆటమిక్‌ ఎనర్జీ ఏజెన్సీ జపోరోజ్యే అణువిద్యుత్‌ ప్లాంటును పర్యవేక్షిస్తోంది.
నిషేధిత ఆయుధాలను ఉక్రెయిన్‌కు అందిస్తోన్న అమెరికా
రష్యా – ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధ నేప థ్యంలో అమెరికా ఉక్రెయిన్‌కి అన్ని విధాలా సహకారమం దిస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అమెరికా ఈ ఏడాది కాలంలో ఉక్రెయిన్‌కి మూడుసార్లు ప్యాకేజీ అందజేసింది. తాజాగా నాలుగో ప్యాకేజీని కూడా అందించనుంది. ఉక్రె యిన్‌కి అందించే ఆయుధాలలో ఒకేసారి వందల సంఖ్య లో బాంబులు, కస్లర్‌ బాంబులను అందించనున్నట్టు మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
ఈ క్లస్టర్‌ బాంబు ఆయు ధాలను వందకు పైగా దేశాలు నిషేధించాయి. ఇలాంటి నిషేధిత అణ్వాయుధాలను ఉక్రెయిన్‌కి అందజేయను న్నట్టు ముగ్గురు అమెరికా అధికారులు శుక్రవారం మీడి యాకు వెల్లడించారు. 155 మిల్లీమీటర్ల హౌవిట్జర్‌ ఫిరం గి నుంచి క్లస్టర్‌ ఆయుధాలతో సహా ఉక్రెయిన్‌కు తాజా ప్యాకేజీని ప్రకటించాలని భావిస్తున్నట్టు ఆ అధికారు లు తెలిపారు. కాగా, క్లస్టర్‌ బాంబులు విస్తారమైన ప్రాం తంలో ఎక్కువ సంఖ్యలో చిన్న బాంబులను విడుదల చేస్తా యి. ఇవి యుద్ధ సమయంలోనే కాక.. యుద్దానంతరం కూడా పౌరులకు పెద్ద ముప్పును కలిగిస్తాయి. ఎందు కంటే కస్టర్‌ విడుదల చేసిన బాంబుల్లో కొన్ని ఆ సమ యంలో పేలవు. ఆ తర్వాత పేలి పౌరులకు ముప్పు కలి గించే ప్రమాదం వుంది. అందుకే ఈ ఆయుధాలను నిషే ధిస్తూ.. 2008లో 120 దేశాలు సంతకం చేశాయి. అయి తే ఈ దేశాల జాబితాలో అమెరికా చేరకపోవడం గమనార్హం.

Spread the love