తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్
కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు.. వినతులు
నవతెలంగాణ – విలేకరులు
గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, గ్రీన్ చానల్ ద్వారా కనీస వేతనాలు అమలు చేయాలని తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేశారు. అనంతరం కలెక్టర్లు, అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రాష్ట్ర ఉద్యమం చేపడతామని సీఐటీయూ నేతలు, కార్మికులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ధర్నాలో పాలడుగు సుధాకర్ మాట్లాడారు. కార్మికులం దరికీ కనీస వేతనాలు అమలు చేస్తామని, మల్టీపర్పస్ పని విధానాన్ని రద్దు చేస్తామని, అర్హత కలిగిన వారిని పర్మినెంట్ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి విస్మరించిందని విమర్శించారు. కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీపీఓ శంకర్ నాయక్‌కు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్య్రకమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండి సలీం, యూనియన్ జిల్లా కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు పొన్న అంజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు చింతపల్లి బయన్న తదితరులు పాల్గొన్నారు. జిగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా చేసి వినతిపత్రం అందించారు. గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు ఇవ్వాలని, వేతనాలకు సంబంధించి రూ.50 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్న ప్రభుత్వ ప్రకటన ప్రకారం వేతనాలు చెల్లించాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాలో పంచాయతీ ఉద్యోగ, కార్మికులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీహర్షకు వినతిపత్రం అందించారు. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సీఐటీయూ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చిన కార్మికులు కలెక్టరేట్ ప్రధాన గేటు ఎదుట బైటాయించారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట కూడా ధర్నా చేసి, జిల్లా కలెక్టర్ హరితకు వినతిపత్రం అందజేశారు. గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న గ్రామ పంచా యతీ కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా ఆకలితో చంపుతున్నారని, వెంటనే బకాయి వేతనాలు ఇవ్వాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఒకటో తేదీనే వేతనాలు వేయాలని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించి వినతిపత్రాలు అందజేశారు. మహబూ బ్‌నగర్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ కె.హరిప్రియకు వినతిపత్రం అందజేశారు వనపర్తి జిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం డీపీఓ శ్రీరామ్‌కు వినతిపత్రం అందజేశారు. నారాయణపేట జిల్లా కలెక్టరేట్ ముందు జీపీ కార్మికులు ధర్నా అనంతరం కలెక్టరేట్ ఏవో అనిల్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
జీపీలకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



