31న అదిరిపోయే అప్‌డేట్‌..

మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తాజాగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.
గత కొంత కాలంగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ల కోసం ఎదురు చూస్తున్న మహేష్‌ ఫ్యాన్స్‌కి ఈనెల 31న అదిరిపోయే అప్‌డేట్‌ రానుంది. సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతి నేపథ్యంలో
ఈనెల 31న ఈ చిత్ర టైటిల్‌ని అనౌన్స్‌ చేయబోతున్నట్టు మేకర్స్‌
శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీలా నాయికలు.
తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Spread the love