పకడ్బందీగా వాహనాల తనిఖీ: ఎస్సై సిహెచ్‌.తిరుపతి

నవతెలంగాణ – కోహెడ
పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీలను పోలీసులు పకడ్బందీగా నిర్వహించారు. మంగళవారం మండలంలోని బస్వాపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ వద్ద వాహనాలను ఎస్సై తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌ కమీషనర్‌ ఆదేశాల మేరకు ఎన్నికల నియమావళి ప్రకారం జిల్లాలో చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్రమంగా ఎవరైన ఎలాంటి ఆధారాలు లేని నగదు, మద్యం, ఓటర్లను ప్రలోభాలకు గురిచెసే వస్తువులను, మాదకద్రవ్యాలను తరలిస్తే చర్యలు తప్పవన్నారు. చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే 50 వేల రూపాయల పైబడి నగదు తరలిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్‌లు రమేష్‌ నాయక్‌, గంగుల రాజు, కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love