నవతెలంగాణ – ఆర్మూర్: మండలంలోని ఇందిరమ్మ కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఆలూర్ మండలంలోని గురువారం అర్ధరాత్రి ఇందిరమ్మ కాలనీలో తాళం వేసిన ఇంట్లో రాత్రి సుమారు రెండు గంటల సమయంలో దొంగతనం జరిగి ఉండొచ్చని బాధితులు కత్తుల చిన్న గంగాధర్ తెలిపారు. వాళ్ళు ఇంటిపైన నిద్రిస్తున్నా ఆ సమయంలో దొంగతనానికి పాల్పడ్డారని 8 తులాల బంగారం 25000/-వేల రూపాయలు వాళ్ల కుమారుడి పాస్పోర్ట్, ప్రాసరి నోట్స్, బ్యాంక్ అకౌంట్స్, పొలం పట్టా పాస్ బుక్ లను చోరీ చేశారని. బాధిత కుటుంబం వాపోయారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శివరాం తెలిపారు.