ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా వైఎస్‌ భాస్కర్‌రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో అరెస్టయిన వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా పరిగణించాలని సీబీఐ కోర్టు తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్‌ జిల్లా మేజిస్ట్రేట్‌కు సిఫార్సు చేసింది. తనను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలన్న భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు అంగీకారం తెలిపింది. వివేకా హత్య కేసులో గత నెల 16నుంచి భాస్కర్‌రెడ్డి చంచల్‌గూడ జైల్లో ఉన్న విషయం తెలిసిందే.

Spread the love