నవతెలంగాణ – హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి శనివారం సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. ఆయనను అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందుస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. జూన్ నెల చివరి వరకు.. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం అవినాష్‌కు ఆదేశించింది. అవినాష్ ముందోస్తు బెయిల్ పొందిన తరువాత మూడో సారి సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఉదయం 10 గంటలకు సీబీఐ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంది. కాగా ఇప్పటికే అవినాష్ ముందోస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైఎస్ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.