యువతకు ఉపాధి కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్
ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్
– ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్

నవతెలంగాణ-హిమాయత్ నగర్ 
ఉపాధి లేక నిరాశ నిసృహలతో కొట్టుమిట్టాడుతున్న యువతకు ఉపాధి కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫుర్తిగా విఫలమయ్యాయని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆరోపించారు. శుక్రవారం హిమాయత్ నగర్, లిబర్టీలోని ఆప్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏం.నరేష్ యాదవ్, వినయ్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు వంద మంది యువకులు డాక్టర్ దిడ్డి సుధాకర్ సమక్షంలో చేరారు. సుధాకర్ తో పాటు ఆప్ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు బుర్ర రాము గౌడ్, ఎంఏ.మజీద్, డాక్టర్ హరిచరణ్ లు వారికీ పార్టీ సభ్యత్వం ఇచ్చి, ఖండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్బంగా డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి యువత రాజకీయాల్లోకి రావడం చాలా ముఖ్యం అని పేర్కొన్నారు. యువత రాజకీయ భాగస్వామ్యం అనేది ప్రజాస్వామ్య హక్కు మాత్రమే కాదని, స్థిరమైన శాంతియుత సమాజాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
ప్రభుత్వాల తప్పిదాలను యువత ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ నిలదీయాలన్నారు. అమాంతంగా రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, గ్యాస్, పప్పులు, బియ్యం, కూరగాయలు, ఉల్లి ధరలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకుండా విభజన రాజకీయాలు చేస్తుండడం దుర్మార్గమన్నారు. మోడీ ప్రభుత్వ హయాంలో దేశంలోని పేదలు ఆకలి, నిరుద్యోగం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. పేదల సంక్షేమం కోసం చేసిన మోడీ సర్కార్ “గరీబ్ కళ్యాణ్” నినాదం నేడు “అమిర్ కళ్యాణ్” గా మరి కేవలం కార్పొరేట్, అత్యంత ధనికుల సంక్షేమం కోసం పని చేస్తుందని విమర్శించారు. రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడం, రాష్ట్రాల హక్కులను కాలరాయడం, ఆమోదయోగ్యం కాని వివాదాస్పద చట్టాలు ప్రజలపై రుద్దడం వంటి ప్రజా వ్యతిరేక బీజేపీ విషపూరిత విధానాలను యువత తిప్పికొట్టాలని ఆయన కోరారు.
నిజాయితీ పాలనా అందించడంతో పాటు మాదకద్రవ్యాలు, కులతత్వం, మతపరమైన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడడమే ఆప్ లక్ష్యం అని, సమాజంలోని వివిధ వర్గాలలోకి చొచ్చుకుపోవడం ద్వారా అట్టడుగు మూలాల నుండి పార్టీ తన బలాన్ని పెంపొందించుకోవడానికి యువశక్తి సహాయం చేస్తుందని, ఆమ్ ఆద్మీ పార్టీలో చేసినందుకు వారికీ దిడ్డి సుధాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆప్ నేతలు మద్ది పరమేష్, బి.స్వామి, బొబ్బల జనార్దన్, పాయల రోహన్ యాదవ్, సాయినాథ్, దాసరి బంధు, మంగల్పాలి నాగార్జున, ఎస్.ఆదిత్య, జాటోత్ వంశీ, టి.రాకేష్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love