బాలికలను చదివిద్ధం భవితకు భరోసాను ఇద్దాం

– న్యాప్ ఫౌండేషన్ డైరెక్టర్ కందుల అనిల్ కుమార్
నవతెలంగాణ – సుల్తాన్ బజార్
బాలికలు చదువులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని న్యాప్ ఫౌండేషన్ ఫౌండర్ డైరెక్టర్ కందుల అనిల్ కుమార్. కార్యదర్శి నేహా లు అన్నారు. ఆదివారం ఆశ్రిత హోంలో విద్యనభ్యసిస్తున్న 150 మంది విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ , షూస్,స్టేషనరీ అందించారు ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీవీణ్ కుమార్ మాట్లాడుతూ.. విజ్ఞానంతో దూసుకుపోతున్న విద్యార్థిని విద్యార్థులకు ఫాదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.సమాజంలో అమ్మాయిలను చదువనివ్వాలని వారిని ఎదగనివ్వాలని పిలుపునిచ్చారు. ఆశ్రిత ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ పర్వతాలు మాట్లాడుతూ..నాన్న యొక్క గొప్పతనాన్ని వివరించారు.నాన్న అంటేదైర్యంనాన్న అంటే సంతోషం నాన్న అంటే నమ్మకం నాన్న అంటే భరోసా నాన్న అంటే సమాజంలో మనల్ని ముందుకు నడిపించే దైవం అని చెప్పారు.ఈకార్యక్రమంలో హోం సిబ్బంది చిన్నారులు పాల్గొన్నారు.

Spread the love