కేటీఆర్‌ను క‌లిసిన ఆర‌న్ క్యాపిట‌ల్ చైర్మెన్‌

నవతెలంగాణ – హైదరాబాద్: ప్ర‌ఖ్యాత ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కంపెనీ ఆర‌న్ క్యాపిట‌ల్ ఇవాళ తెలంగాణ స‌ర్కార్‌తో డీల్ కుదుర్చుకున్న‌ది. అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మంత్రి కేటీఆర్‌ను ఆర‌న్ క్యాపిట‌ల్ చైర్మ‌న్ డేవిడ్ వోల్ఫే నేతృత్వంలోని ఎగ్జిక్యూటివ్ బృందం క‌లిసింది. న్యూయార్క్‌లో ఆ భేటీ జ‌రిగింది. తెలంగాణ ప్ర‌భుత్వం, ఆర‌న్ క్యాపిట‌ల్ మ‌ధ్య స‌హ‌కారం గురించి చ‌ర్చించారు. తెలంగాణ‌లో పెట్టుబ‌డులకు అనుకూల వాతావ‌ర‌ణం ఉన్న‌ట్లు మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. ఆవిష్క‌ర‌ణ వ్య‌వ‌స్థ‌తో పాటు అత్యుత్త‌మ మౌళిక‌స‌దుపాయాలు, నైపుణ్య‌వంత‌మైన వ‌ర్క్‌ఫోర్స్ కూడా ఉన్న‌ట్లు మంత్రి తెలిపారు.కంపెనీల‌ను విలీనం చేయ‌డంలో, కొనుగోలు చేయ‌డంలో, పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డంలో, ఫైనాన్సింగ్, అడ్వైజ‌రీ సేవ‌ల్లో ఆర‌న్ క్యాపిట‌ల్ సంస్థ ప్ర‌త్యేక‌త క‌లిగి ఉంది. అనేక ర‌కాల ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన క్ల‌యింట్లు ఆ కంపెనీకి ఉన్నారు. మీడియా, హెల్త్‌కేర్‌, లైఫ్ సైన్సెస్‌, కన్జూమ‌ర్ ప్రొడ‌క్ట్స్‌, స‌ర్వీసెస్‌, ఫుడ్ అండ్ బివ‌రేజెస్‌, ప‌రిశ్ర‌మ‌లు, టెక్నాల‌జీ, రియ‌ల్ ఎస్టేట్ లాంటి రంగాల్లో ఆ కంపెనీకి క్ల‌యింట్లు ఉన్నారు.

Spread the love