సీఎం గెలుపు…

11 మంది మంత్రుల ఓటమి
బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి సిఎం బసవరాజ్‌ బొమ్మై, 11 మంది మంత్రులు గెలుపొందగా, 11 మంది మంత్రులు ఓటమి పాలయ్యారు. ఈ ఓటమితో బిజెపి ఏకైక దక్షిణాది రాష్ట్రాన్ని కోల్పోయింది. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై సిహ్గావ్‌ నియోజకవర్గం నుండి 35,000 ఓట్లకు పైగా పొంది, 54.95 శాతం ఓట్లతో గెలిచారు.
ఓడిన మంత్రులు
వి సోమన్న (గృహ నిర్మాణ శాఖ మంత్రి) వరుణ, చామరాజనగర్‌ స్థానాల్లో ఓటమి పాలయ్యారు. బళ్లారి నుంచి బిఎస్‌ శ్రీరాములు (రవాణా శాఖ మంత్రి), చిక్కనాయకనహళ్లి నుంచి మధుస్వామి (న్యాయశాఖ మంత్రి), ముధోల్‌ నుంచి గోవింద కరజోల్‌ (నీటిపారుదల శాఖ మంత్రి), చిక్క బళ్లాపూర్‌ నుంచి కె.సుధాకర్‌ (ఆరోగ్య, సంక్షేమ శాఖ మంత్రి), హొస్కోటే నుంచి ఎంటిబి నాగరాజ్‌ (చిన్న పరిశ్రమల శాఖ మంత్రి), హిరేకెరూరు నుంచి బిసి పాటిల్‌ (వ్యవసాయశాఖ మంత్రి), బీళగి నుంచి మురుగేశ్‌ నిరాణి (పరిశ్రమల శాఖ మంత్రి), కెసి నారాయణగౌడ్‌ (క్రీడలశాఖ మంత్రి), పీట్‌, తిపూర్‌ నుంచి బిసి నగేష్‌ (ప్రాథమిక, మాధ్యమిక శాఖ మంత్రి), నవలగుంద నుంచి శంకర్‌ పాటిల్‌ (టెక్స్‌టైల్‌ శాఖ మంత్రి) ఓడిపోయారు.
గెలిచిన మంత్రులు
తీర్థహళ్లి నుంచి అరగ జ్ఞానేంద్ర (హోం మంత్రి), సిహెచ్‌ అశ్వధ నారా యణ (సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి), గడగ్‌ నుంచి సిసి పాటిల్‌ (పిడబ్ల్యుడి మంత్రి), ఓవ్రాద్‌ నుంచి ప్రభు చౌహాన్‌ (పశు సంవర్ధక శాఖ మంత్రి), యశ్వంత్‌పూర్‌ నుంచి ఎస్‌టి సోమశేఖర్‌ (సహకార శాఖ మంత్రి), కెఆర్‌ పురం నుంచి బైరతి బసవరాజ్‌ (పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి), మహాలక్ష్మి లేఅవుట్‌ నుంచి గోపాలయ్య (ఎక్సైజ్‌ శాఖ మంత్రి), నిప్పాణి నుంచి శశికళ జొల్లె (హజ్‌, వక్ఫ్‌ శాఖ మంత్రి), సునీల్‌కుమార్‌ (సాంస్కృతిక శాఖ మంత్రి) కర్కల, రాజరాజేశ్వరి నగర్‌ నుంచి మునిరత్న నాయుడు (ఉద్యానవనశాఖ మంత్రి), ఎల్లాపూర్‌ నుంచి శివరామ్‌ హెబ్బార్‌ (కార్మికశాఖ మంత్రి)
రాహుల్‌ పర్యటించిన మెజారిటీ స్థానాల్లో విజయం
కర్నాటకలో కాంగ్రెస్‌ భారీ విజయానికి రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర’నే కారణం అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాహుల్‌ గాంధీ యాత్ర వల్లే ఈ స్థాయిలో విజయం వరించిందని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌ కమ్యూనికేషన్‌ చీఫ్‌, రాజ్యసభ ఎంపీ జైరాం రమేష్‌ భారత్‌ జోడో యాత్ర ప్రభావాన్ని తెలిపే స్టాటిస్టిక్స్‌ని ట్వీట్‌ చేశారు. గతేడాది సెప్టెంబర్‌ 7న తమిళనాడులోని కన్యాకుమారి మీదుగా కేరళ, కర్నాటక సహా 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా ఈ యాత్ర జరిగింది.
కర్నాటకలో 20 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా రాహుల్‌ పాదయాత్ర సాగింది. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో ఈ 20 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ 15 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ 2, జేడీఎస్‌ 3 స్థానాలకే పరిమితమయ్యాయి.
2018 ఎన్నికల్లో ఈ స్థాన్షాల్లో బీజేపీ 9, కాంగ్రెస్‌ 5 స్థానాల్లో గెలుపొందాయి. యాత్రలో కర్నాటక ప్రజలతో మాట్లాడామని, పార్టీని ఏకం చేయడంతోపాటు క్యాడర్‌ను సమాయత్తం చేశామని, వీటి ద్వారానే మానిఫెస్టోలోని హామీలు, వాగ్దానాలను చర్చించి ఖరారు చేశామని జైరాం రమేష్‌ ట్వీట్‌ చేశారు.

Spread the love