భారతీయ భాషలను బోధనా మాధ్యమంగా పరిగణించండి

పాఠశాలలను కోరిన సీబీఎస్‌ఈ
న్యూఢిల్లీ : భారతీయ భాషలలో బోధన విషయంలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలో ప్రీ-ప్రైమరీ తరగతుల నుంచి 12వ తరగతి వరకు ప్రస్తుత ఎంపికలతో పాటు రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 8లో పేర్కొన్న భారతీయ భాషల ఎంపికను బోధనా మాధ్యమంగా అందించడాన్ని పరిశీలిం చాలని సీబీఎస్‌ఈ.. దాని అనుబంధ పాఠశాలలను కోరిం ది. ఈ మేరకు అన్ని అనుబంధ పాఠశాలల అధిపతులకు లేఖను పంపింది. సీబీఎస్‌ఈ డైరెక్టర్‌ (విద్యావేత్తలు) జోసెఫ్‌ ఇమ్మాన్యుయేల్‌ మాట్లాడారు.
అమలు, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు, అధిక నాణ్యత గల బహుభాషా పాఠ్యపుస్తకాల పరంగా మాతభాషను బోధనా మాధ్యమంగా ఉపయోగించడంలో అనేక సవాళ్లు ఉన్నాయన్నారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ భారతీయ భాషలలో విద్యను వాస్తవీకరించడానికి అనేక చర్యలు తీసుకున్నదని తెలిపారు.

Spread the love