భిన్న కాంబినేషన్‌

మలయాళ యువ కథానాయకుడు దుల్కర్‌ సల్మాన్‌ అన్ని భాషల్లోనూ తనదైన శైలిలో రాణిస్తున్నారు. ఆయన ఏ భాషలో నటించినా, అక్కడి సంస్కతికి తగ్గట్లుగా తనని తాను మలచుకొని, ఆ మట్టిలో పుట్టిన వ్యక్తిగానే అందరికీ చేరువ అవ్వడం విశేషం. తన ప్రతిభతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతగానో దగ్గరైన దుల్కర్‌ సల్మాన్‌ తన కొత్త చిత్రాన్ని యువ దర్శకుడు వెంకీ అట్లూరితో చేయబోతున్నారు ‘సార్‌/వాతి’తో ఘన విజయాన్ని అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి మరోసారి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ నిర్మాణంలో ఈ సినిమా చేస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ కలిసి అత్యుత్తమ నాణ్యత, కంటెంట్‌తో కూడిన అద్భుతమైన చిత్రాలను నిర్మిస్తున్నాయి. వినోదాన్ని అందించడంతో పాటు, ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచి పోయే చిత్రాలను అందించడానికి వారు కషి చేస్తున్నారు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులందరినీ తప్పకుండా అలరించే మరో క్వాలిటీ, కంటెంట్‌ ఓరియెంటెడ్‌ సినిమా అవుతుందనే దీమాని వ్యక్తం చేశారు. అద్భుతమైన కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ చిత్ర షూటింగ్‌ అక్టోబర్‌ నుండి ప్రారంభం కానుంది. 2024 వేసవిలో విడుదలకి ప్లాన్‌ చేస్తున్నారు.

Spread the love