‘ఉరి’సిల్లగా… మార్చొద్దు

సిరిసిల్ల… ఉరిసిల్లగా మారకముందే నేతన్నలను ఆదుకోకుంటే పాత రోజులు పునరావృతమవుతాయి. కండె పోగులే మరణమృదంగాలై చేనేత కార్మికులను బలిగొన్న గతం మరోసారీ నిజం కాకుండా ఉండాలంటే సర్కార్‌ పెద్దమనసుతో తాయిలాలు ప్రకటించాలి. గడిచిన ఏడాది బతుకమ్మ చీరల పెండింగ్‌ బకాయిలు రూ.220 కోట్లు ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించకపోగా, ఈ ఏడాది చీరల ఆర్డర్లివ్వలేదు. ఫలితంగా అసాములు మరమగ్గాలకు హలీడే ప్రకటించడంతో పనులు లేక 30 వేల మంది కార్మిక కుటుంబాలు వీధిన పడ్డాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన నిర్వాకానికి తోడు కేంద్రంలోని మోడీ సర్కార్‌ చర్యలు మూలిగే నక్కపై తాటిపండులా పరిణమించాయి.. టెక్స్‌టైల్‌, చేనేత బోర్డులను రద్దు చేయడంతో పాటు వాటి ఉత్పత్తులు, ముడిసరుకులపై కేంద్రం పెంచిన 12 శాతం జీఎస్టీ నేతన్నలకు శాపంగా మారాయి. సిరిసిల్ల నేత కార్మికుల దుస్థితికి తప్పు ఎవరిదనే చర్చ పక్కనపెట్టి ముందు వారిని ఆదుకునేందుకు రేవంత్‌ సర్కార్‌ వెంటనే చర్యలు చేపట్టాలి.
-ఊరగొండ మల్లేశం

Spread the love