ఆహా..ఎంత చైతన్యం…

మన దేశంలో డాక్టర్లు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, మేధావులకు కొదవ లేదు. అనేక రంగాల్లో భారతీయులు మన జాతీయజెండాను ప్రపంచ వేదికల మీద రెపరెపలాడించారు. అయితే ఇటీవల దేశభక్తి ఒక్కోసారి వక్రీకరించబడుతూ మనల్ని ఆలోచనలో పడేస్తోంది. ఇండియాలో పుట్టి… ఇక్కడే పెరిగి, ఇక్కడి వనరుల ద్వారా ఉన్నత విద్యనభ్యసించి విదేశాల్లో సెటిలైన వారి మైండ్‌సెట్‌ కొన్ని సందర్భాల్లో వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉండటం విడ్డూరంగా ఉండటం ఆందోళనకరం. ఇటీవల సీఎం కేసీఆర్‌… జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై కొన్ని కామెంట్లు చేశారు. తమ ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికలు, అందులో పని చేస్తున్న పాత్రికేయులకు ఇండ్లను ఇవ్వబోమంటూ ఆయన తేల్చి చెప్పారు. ఆ సందర్భంగా ఓ ఎన్‌ఆర్‌ఐ ఫోన్‌లో మాట్లాడుతూ…’ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను, వనరులను సదరు ప్రభుత్వాధినేత ఏమైనా చేసుకోవచ్చు. అది ఆయనిష్టం. ఆ కోణంలోనే కేసీఆర్‌ మాట్లాడి ఉండొచ్చు…’ అంటూ కామెంట్‌ చేశారు. దానికి ప్రతిగా… ‘అయితే కేంద్రంలో ప్రధాని మోడీ కూడా ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్ముతున్నారు. మీరు చెప్పిన కోణంలో అది కూడా కరెక్టేనా…?’ అంటే… ‘అవును… ప్రధాని కూడా దేశాన్ని ఏమైనా చేసుకోవచ్చు…’ అనే రీతిలో మన వీర ఎన్‌ఆర్‌ఐ జవాబిచ్చారు. ఆహా…విదేశీ గడ్డపై డాలర్లకు డాలర్లు సంపాదిస్తూ, విలాసంగా గడుపుతున్నారంటే ఏమో అనుకున్నా… ఇదన్నమాట మీ చైతన్యం.. మీ అవగాహన… అనుకోవటం నా వంతైంది. -కేఎన్‌ హరి

Spread the love