కోటా పెంచినా దక్కని ఫలితం !

ఎస్సీ, ఎస్టీ సీట్లలో రాలని ఓట్లు
ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాలని, ఎస్సీలకు అంతర్గతంగా రిజర్వేషన్లు కల్పించాలని కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ప్పటికీ ఆ వర్గాల ఓట్లను రాబట్టలేకపోయింది. రాష్ట్రంలోని 51 రిజర్వ్‌డ్‌ స్థానాలలో ఆ పార్టీకి దక్కింది కేవలం 12 మాత్రమే. 2018 ఎన్నికలలో బీజేపీ 22 రిజర్వ్‌డ్‌ స్థానాలను గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు బీజేపీ ప్రభుత్వం ఎస్సీల రిజర్వేషన్లను 15శాతం నుండి 17శాతం, ఎస్టీల రిజర్వేషన్లను 3శాతం నుంచి 7శాతం పెంచింది. 2018 ఎన్నికలలో
బీజేపీ 16ఎస్సీ స్థానాలు, 6 ఎస్టీ స్థానాలు గెలుచుకోగా ఈ ఎన్నికలలో 12 ఎస్సీ స్థానాలు మాత్రమే లభించాయి. ఎస్టీ అభ్యర్థులలో ఒక్కరు కూడా గెలవ లేదు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ 21 ఎస్సీ సీట్లు, 14 ఎస్టీ సీట్లు గెలుచు కుంది. 2018 ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీకి 15 రిజర్వ్‌డ్‌ స్థానాలు అదనం గా లభించాయి. ఏ కులానికైనా రిజర్వేషన్లు పెంచాలన్నా లేదా తగ్గించాల న్న సుదీర్ఘమైన ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందని, శాస్త్రీయ గణాం కాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పీసీసీలో సామాజిక న్యాయ విభాగం అధ్యక్షుడు సీఎస్‌ ద్వారకానాథ్‌ చెప్పారు. అయితే బీజేపీ ప్రభుత్వం పెంచిన రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి గణాంకాలు అందు బాటులో లేవని విమర్శించారు. యాభై శాతం పరిమితిని మించి రిజర్వేష న్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణను తీసుకొచ్చే విషయంలో బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించలేదు. దీంతో ప్రభుత్వ ఉద్దేశంపై ఎస్సీ లు, ఎస్టీలలో అనుమానాలు రేకెత్తించేం దుకు కాంగ్రెస్‌, జేడీ (ఎస్‌)లకు ఆయుధం దొరికినట్లయింది. అయితే రిజర్వేషన్ల పెంపుపై కర్నాటక బీజేపీ లేఖ రాసినప్పటికీ 50 శాతానికి మించి పెంచే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర మంత్రి ఎ. నారాయణస్వామి లోక్‌సభకు తెలియజేశారు. దీంతో ఎస్సీ, ఎస్టీలలో మరిన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి.

Spread the love