తెల్లజుట్టు నివారణకు

For the prevention of white hairబ్లాక్‌ టీ : ఒక కప్పు నీళ్ళు మరగబెట్టి అందులో రెండు టీ స్పూన్ల బ్లాక్‌ టీ ఆకులు వేసి రెండు నిమిషాలు మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారాక జుట్టుకి పట్టించి ఒక గంట ఆరిన తర్వాత చన్నీటితో షాంపూ లేకుండా కడిగేయాలి. రెండు వారాలకి ఒకసారి ఇలా చేస్తుంటే జుట్టుకు నల్ల రంగు వస్తుంది. జుట్టు మెరుస్తుంది.
నిమ్మకాయ, కొబ్బరి నూనె : రెండు చెంచాల కొబ్బరి నూనెలో ఒక చెంచా నిమ్మరసం కలపాలి. దీన్ని కుదుళ్ళ నుంచి జుట్టు చివరల వరకు నెమ్మదిగా పట్టించి, ముప్ఫై నిమిషాలు వదిలేయాలి. షాంపూతో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయవచ్చు. దీని వల్ల అప్పటికే తెల్లబడిన జుట్టు నల్లగా మారదు కానీ, కొత్తగా తెల్ల జుట్టు రావడం తగ్గుతుంది.
కరివేపాకు : ఒక పాన్‌లో మూడు చెంచాల కొబ్బరినూనెలో ఒక గుప్పెడు కరివేపాకు వేసి సన్న మంట మీద స్టవ్‌ మీద ఉడికించాలి. పాన్‌ అడుగున నల్లగా ఏర్పడేవరకూ ఇలా చేసి, దించి, చల్లారనివ్వాలి. ఈ నూనెను మొదళ్ళ నుంచి జుట్టు చివర వరకు నెమ్మదిగా పట్టించి, గంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేస్తే జుట్టు కుదుళ్ళకు బలంతో పాటు బాగా పెరుగుతుంది.

Spread the love