ఒకేసారి నలుగురు మృతి

చావులోనూ విడిపోని అన్నదమ్ములు
– ఒకేసారి నలుగురు మృతి
– మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు
– శోకసంద్రమైన చౌటపల్లి
– నివాళులర్పించిన ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌
నవతెలంగాణ-అక్కన్నపేట
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ రోడ్డు ప్రమాదంలో అక్కన్నపేట మండలంలోని చౌటపల్లి గ్రామానికి చెందిన నలుగురు అన్నదమ్ములు మతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో మరణించిన ఆ నలుగురు అన్నదమ్ముల మతదేహాలు గురువారం చౌటపల్లి గ్రామానికి చేరుకున్నాయి. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నాలుగు కుటుంబాలు పెద్దదిక్కు కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఒకేసారి నాలుగు మృతదేహాలను అంత్యక్రియలకు తీసుకెళ్తుంటే ఊరు ఊరంతా శోకసంద్రంలో మునిగిపోయింది. బాధిత కుటుంబాలను హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీష్‌ కుమార్‌ గురువారం పరామర్శించి మృతదేహాలకు నివాళులర్పించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బతుకుదెరువు కోసం సూరత్‌లో ఉంటు న్నారని, ఈ మధ్యకాలంలోనే వారి చిన్ననాన్న చౌటపల్లిలో మృతి చెందగా ఆయన అంత్యక్రియలో పాల్గొని తిరిగి ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో ఔరంగాబాద్‌ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరి కారు ఫల్టీ కొట్టి ఎరుకల కష్ణ, సంజీవ్‌, వాసు, సురేష్‌ అక్కడికక్కడే మృతి చెందారని కుటుంబీకులు తెలియజేశారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
నవతెలంగాణ వర్గల్‌
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని గౌరారం శివారులో జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లాల్‌ గాడి మాలక్‌ పెట్‌ కి చెందిన లక్ష్మీ(61) అనారోగ్యంగా ఉండడంతో చేబర్తి గ్రామానికి చెందిన తన అల్లుడు గురువారం గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా గౌరారంలోని మామిడియాల కామన్‌ వద్ద ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై నుంచి కింద పడడంతో తలకు బలమైన గాయం తగిలి అక్కడిక్కడే మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గౌరవరం ఎస్సై సంపత్‌ కుమార్‌ తెలియజేశారు.
ద్విచక్ర వాహనం చక్రంలో చున్నీ చిక్కుకొని మహిళ మృతి
నవతెలంగాణ ములుగు
ద్విచక్ర వాహనం చక్రంలో చున్నీ చిక్కుకుని మహిళ మృతి చెందిన సంఘటన తునికి బొల్లారం సమీపంలో జరిగింది. గంగాధర్‌పల్లి గ్రామానికి చెందిన తాటికొండ శైలజ(19) తన భర్త సురేష్‌తో కలిసి తల్లిగారి ఇంటి నుండి మనోహరాబాద్‌ మండలం కల్లకల్‌ గ్రామం నుంచి తన అత్తగారిల్లు ములుగు మండలం గంగాధర్‌ పల్లి గ్రామానికి గురువారం ఉదయం 8.30 గంటలకు వెళ్తున్నారు. తునికి బొల్లారం సమీపంలో గల రోడ్డుపై వాహనం అతివేగంగా అజాగ్రత్తగా నడిపాడు. ఆమె మెడలోని చున్నీ బండి టైర్లలో చిక్కుకుని శైలజ కిందపడి ముఖానికి, తలకు తీవ్ర రక్త గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. ములుగు ఎస్సై రంగా కష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
హనుమాన్‌ బండల్‌ సమీపంలో గుర్తుతెలియని శవం లభ్యం
– హత్య చేసి ఉంటారని పోలీసుల అనుమానం
నవతెలంగాణ- కొల్చారం
కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామ శివారు మెదక్‌- నర్సాపూర్‌ జాతీయ రహదారి పక్కన హనుమాన్‌ బండల్‌ సమీపంలో గల మంజీరా నది ఒడ్డున గురువారం గుర్తుతెలియని వ్యక్తి శవం లభించినట్లు కొల్చారం పోలీసులు గుర్తించారు. ఎస్సై శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమాన్‌ బండల్‌ శివారులో గుర్తుతెలియని వ్యక్తి శవం ఉందన్న విషయం తెలిసిందన్నారు. దీంతో అక్కడికి వెళ్లి చూడగా మతదేహాన్ని తెల్లని గోనె సంచులతో రాళ్లకు కట్టి మంజీరాలో పడేసినట్లు తెలిపారు. శవం గుర్తుపట్టలేని స్థితిలో కుళ్లిపోయిందన్నారు. మతిని వయస్సు 35 ఏళ్లు ఉంటాయని, చాతిపై జంగయ్య పేరుతో పాటు లవ్‌ సింబల్‌ ఉండి పక్కనే వీరమని పేర్లతో కూడిన పచ్చబొట్లు ఉన్నాయన్నారు. మరోవైపు కుడి భుజంపై ఓం గుర్తుతో పచ్చబొట్టు ఉందని గుర్తించారు. మృతుడి శరీరంపై బూడిద రంగు జీన్స్‌ ప్యాంట్‌ ధరించి ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా తలపై గాయాలు ఉండడం పట్ల ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. మతదేహాన్ని గుర్తుపట్టిన వారు ఎవరైనా ఉటే ఈ క్రింది నెంబర్లకు 87126 57919, 8712657916, 8712657880, 871265888 సమాచారం ఇవ్వాలని కోరారు.
తాడిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ-నంగునూరు
తాడిచెట్టు పైనుం చి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాల పాలైన ఘటన నంగునూరు మండల పరిధిలోని అంక్షాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. గీత కార్మికులు గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… ఆ గ్రామానికి చెందిన బందారం శేఖర్‌గౌడ్‌(40) రోజు మాదిరిగానే శేఖర్‌ గౌడ్‌ బుధవారం మధ్యాహ్నం తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తున్నాడు. ఈ క్రమంలో చెట్టు పైనుంచి జారి కింద పడ్డాడు. పరిసర ప్రాంతంలోని బంధువులు వెంటనే 108 అంబులెన్స్‌ ద్వారా సిద్ధిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శేఖర్‌గౌడ్‌కు బలమైన గాయాలయ్యాయి. వైద్యులు గాంధీకి రెఫర్‌ చేశారు. బంధువులు చొరవ తీసుకొని సిద్దిపేటలోనే ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తున్నట్లు తెలిసింది. కులవత్తిపై ఆధారపడి జీవనం గడుపుతున్న శేఖర్‌గౌడ్‌ తాడిచెట్టు పైనుంచి పడడంతో అతని కుటుంబం రోడ్డున పడిందని తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అతని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. శేఖర్‌గౌడ్‌కు భార్యతో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు.

Spread the love