రండి ప్రభుత్వ కళాశాలలోనే చేరండి

ప్రభుత్వ కళాశాలల్లోనే
డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల కోసం అధ్యాపకుల క్యాంపెయిన్‌

ప్రయివేటుకు ధీటుగా.. ప్రణాళికబద్ధంగా ప్రభుత్వ అధ్యాపకుల ప్రచారం
నవతెలంగాణ-జోగిపేట
నెహ్రూ మెమోరియల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లను పెంచేందుకు ప్రభుత్వ అధ్యాపకులు నడుం బిగించారు. ‘రండి ప్రభుత్వ కళాశాలలోనే చేరండి’ అంటూ క్యాంపెయిన్‌ ప్రారంభించారు. ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాల లు, జూనియర్‌ కళాశాలలో అడ్మిషన్ల పై ఈ తరహా ప్రచారం చేయగా.. తాజాగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైతం ఈ కార్యచరణ లోనికి దిగారు. డిగ్రీ ఆన్లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ దోస్తు ద్వారా ప్రభుత్వ కాలేజీల్లో చేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది.
క్యాంపెయిన్‌ సాగుతున్నదిలా..
కళాశాల ప్రత్యేకతలతో కూడిన వినతి పత్రం ముద్రిస్తున్నారు. కళాశాల విద్యార్థుల గత విజయాలను దీంట్లో పొందుపరుస్తున్నారు. ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు జరిగిన రోజుల్లో పరీక్షా కేంద్రాల వద్ద ఈ కరపత్రా లను పంపిణీ చేశారు. జూనియర్‌ కాలేజీలలో ద్వితీయ సంవ త్సరం పూర్తి చేసుకున్న విద్యార్థుల పేర్లు, ఫోన్‌ నెంబర్లను సేకరించి వారికి ఫోన్ల ద్వారా ప్రభుత్వ కళాశాలలో చేరాలని సూచిస్తున్నారు. వాట్సప్‌ గ్రూపుల్లో ప్రభుత్వ కళాశాలల ప్రత్యేకతలను వసతులను వివరిస్తూ కొన్ని సంక్షిప్త వీడియోలను తయారు చేసి పోస్ట్‌ చేస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపాల్‌, అధ్యాపకుల సహకారంతో పూర్వ విద్యా ర్థులు
అడ్మిషన్లు పెంచడంలో ప్రధాన పాత్ర వహిస్తున్నారు. దోస్త్‌ నోటిఫికేషన్‌ రాగానే కోర్సుల వారీగా విద్యార్థులకు చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
కోర్సుల వివరాలు..
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం బీఏ-హెచ్‌ఈపీ/ హెచ్‌పీపీ(ఇంగ్లీష్‌, తెలుగు మీడియం), బీకాం-కంప్యూటర్‌ అప్లికేషన్‌(ఇంగ్లీష్‌, మీడియం), బీఎస్సీ-బీజెడ్‌సీ/ బీజెడ్‌సీఎస్‌/ఎంపీసీ/ఎంపీసీఎస్‌(ఇంగ్లీష్‌ మరియు తెలుగు మీడియం) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధ్యాపకులు కోరుతున్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అన్ని వసతులున్నాయి
ప్రభుత్వ డిగ్రీ కళాశాల జోగిపేటలో అన్ని రకాలైన వసతులు న్నాయి. విద్యా ర్థులకు జిమ్‌ సదుపాయం, యువ తరంగం జిజ్ఞాస మరియు టీఎస్‌కేసీ ద్వారా ఉద్యోగ నైపుణ్య శిక్షణ, ఉద్యోగాలు కల్పిస్తారు.. ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా విద్యార్థు లకు సామాజిక సేవ పట్ల అవగాహన పెంపొందించడం జరుగుతుంది. కావున తల్లిదండ్రులు తమ విద్యార్థులను ప్రభుత్వ కళాశాలలో చేరేలా ప్రోత్సహించాలి.
– ఏ.గోపాల్‌, జంతు శాస్త్ర అధ్యాపకులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జోగిపేట
ఉన్నత విద్యార్హాతలు కలిగిన అధ్యాపకులు
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనే అన్ని రకాల వసతులు ఉంటాయి. నెట్‌, సెట్‌, పీహెచ్డీ అర్హతలు ఉన్నవారే అధ్యా పకులుగా పనిచేస్తున్నారు. విద్యార్థుల ప్రగతికి ప్రభుత్వ కళాశాలలే ఎంతో తోడ్పాటు అందించ గలవు. అడ్మిషన్లు పెంచడం కోసం మా అధ్యాపక మిత్రులందరం సమిష్టిగా కషి చేస్తున్నాం. ఇంట ర్‌ పరీక్షల సమయంలో విద్యార్థులకు కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రభుత్వ కళాశాలలో చేరాలని విన్నపిస్తున్నాం. సోషల్‌ మీడియా ద్వారా కూడా విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలల పట్ల అవగాహన కల్పిస్తున్నాం.
– డాక్టర్‌ పి.అడవి రాజు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌, జోగిపేట

Spread the love